అర్జున్ రెడ్డి గురించి కబీర్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

80

పెళ్లిచూపులు తర్వాత విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. సందీప్ వంగ డైరక్షన్ లో తెరకెక్కిన ఆ సినిమా విజయ్ కు యూత్ లో బీభత్సమైన క్రేజ్ వచ్చేలా చేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా తమిళ, హింది భాషల్లో రీమేక్ అవుతుంది. తమిళంలో చియాన్ విక్రం తనయుడు ధ్రువ్ హీరోగా ఆదిత్య వర్మ టైటిల్ తో వస్తుంది. హిందిలో షాహిద్ కపూర్ హీరోగా సినిమా చేస్తున్నాడు.

హింది వర్షన్ ను సందీప్ వంగ డైరెక్ట్ చేస్తుండటం విశేషం. కబీర్ సింగ్ టైటిల్ తో వస్తున్న హింది అర్జున్ రెడ్డి ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ ప్రస్థావన తెచ్చడు షాహిద్ కపూర్. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ అద్భుతంగా నటించాడని. అతన్ని మ్యాచ్ చేసేందుకు బాగా ట్రై చేశానని. విజయ్ లా చేసేందుకు బాగా కష్టపడాల్సి వచ్చిందని అన్నారు షాహిద్.

బాలీవుడ్ లో తానో స్టార్ హీరో అయినా విజయ్ దేవరకొండ గురించి అంత గొప్పగా మాట్లాడటం షాహిద్ కపూర్ కే చెల్లింది. కబీర్ సింగ్ ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉంది. సినిమా తెలుగు వర్షన్ కు జిరాక్స్ కాపీలా ఉన్నా బాలీవుడ్ ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యేలా తీశారు. సినిమాలో షాహిద్ కు జోడీగా కియరా అద్వాని నటించింది.

Leave a comment