బిచ్చగాడు హీరో కొత్త సినిమా కాశి.. ఆన్ లైన్ లో రిలీజ్ కు ముందే 8 నిమిషాల వీడియో ..!

kaasi-movie-online

బిచ్చగాడు సినిమాతో తెలుగు పరిశ్రమలో డబ్బింగ్ సినిమాతో సంచలనం సృష్టించిన విజయ్ ఆంటోనీ ఆ సినిమా తర్వాత తన ప్రతి సినిమా తమిళంతో పాటుగా తెలుగులో కూడా సూపర్ క్రేజ్ ఏర్పడింది. బిచ్చగాడు తర్వాత బేతాళుడు, యమన్, ఇంద్రసేన ఇలా తన ప్రతి సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తూ వచ్చాడు విజయ్.

అక్కడ స్టార్లుగా ఉన్న ఇళయదళపతి విజయ్, తల అజిత్ లకు లేని ఫాలోయింగ్ తెలుగులో విజయ్ ఆంటోనీకి వచ్చింది. ఇక వచ్చిన క్రేజ్ ను వాడుకునే క్రమంలో విజయ్ తన ప్రతి సినిమాను రిలీజ్ ముందే కొంత సినిమా రిలీజ్ చేస్తున్నాడు. బేతాళుడులో జయలక్ష్మి పాట మొత్తం రిలీజ్ చేయగా యమన్, ఇంద్రసేన కూడా ఇదే రకమైన ప్రమోషనల్ స్టంట్స్ చేశాడు.

ఇప్పుడు రాబోతున్న కాశి సినిమాకు రిలీజ్ ముందే 7 నిమిషాల సీన్ రిలీజ్ చేశాడు విజయ్. ఉదయనిధి డైరక్షన్ లో వస్తున్న కాశి సినిమా సరికొత్త కాన్సెప్ట్ తో వస్తుంది. కచ్చితంగా తెలుగు ఆడియెన్స్ ను అలరిస్తుందని సినిమాను 7 నిమిషాల ముందే రిలీజ్ చేశారు. మరి ప్రతి సినిమా బిచ్చగాడు రేంజ్ కాకపోయినా విజయ్ ఆంటోనీ కోరుకునే సర్ ప్రైజ్ హిట్ ఈ కాశీ ఇస్తుందేమో చూడాలి.

Leave a comment