Newsకాలా కి మొదటి రోజే భారీ షాక్... యాక్షన్ లోకి దిగిన...

కాలా కి మొదటి రోజే భారీ షాక్… యాక్షన్ లోకి దిగిన విశాల్..45 నిమిషాల్లోనే అరెస్ట్!

సూపర్ స్టార్ రజినికాంత్, పా. రంజిత్ డైరక్షన్ లో వచ్చిన సినిమా కాలా. కబాలి తర్వాత ఈ కాంబినేషన్ లో వచ్చిన కాలా రిలీజ్ ముందునుండి ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇక ఇప్పుడు రిలీజ్ నాడు కూడా ఓ అభిమాని ఈ సినిమా ప్రీమియర్ షో చూస్తూ ఫేస్ బుక్ లో లైవ్ టెలికాస్ట్ చేయడం సంచలనంగా మారింది.

సింగపూర్ లోని కెథే మల్టీప్లెక్స్ నుండి ఆ లైవ్ స్ట్రీమింగ్ రాగా వెంటనే కోలీవుడ్ హీరో యాక్షన్ లోకి దిగి అతన్ని అరెస్ట్ చేయించాడు. దాదాపు 40 నిమిషాల సినిమా లీక్ చేసినట్టు తెలుస్తుంది. సూపర్ స్టార్ రజినికాంత్ రెండేళ్ల తర్వాత చేసిన సినిమా కాలా ఈ సినిమాను ఇలా లైవ్ లో పెట్టి పైరసీ చేసినందుకు విశాల్ 45 నిమిషాల వ్యవధిలో అతన్ని అరెస్ట్ చేయించడం హాట్ న్యూస్ గా మారింది.

ఇండస్ట్రీ బాగుపడాలంటే పైరసీని సమూలంగా నాశనం చేయాలి. కాని ఇలాంటి దుశ్చర్యల వల్ల టోటల్ ఇండస్ట్రీ నష్టాల పాలవుతుంది. ఇక నుండి పైరసీ మీద మరింత సీరియస్ యాక్షన్ తీసుకునేలా కార్యచరణలు చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news