Gossipsటాలీవుడ్ ని వణికిస్తున్న కరికాలుడు..!

టాలీవుడ్ ని వణికిస్తున్న కరికాలుడు..!

సూపర్ స్టార్ రజినికాంత్, పా. రంజిత్ కాంబోలో వచ్చిన కాలా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. రెండు మూడు సార్లు రిలీజ్ వాయిదా పడుతూ ఫైనల్ గా జూన్ 7న రిలీజ్ అయిన ఈ సినిమాకు టాలీవుడ్ భయపడిందని తెలుస్తుంది.

ఏప్రిల్ 27న అంటే బన్ని, మహేష్ లు కంగారు పడ్డారు. ఇక జూన్ 7న ఒక్క తెలుగు సినిమా కూడా పోటీకి దిగలేదు. కబాలి తర్వాత పా. రంజిత్ తో రజిని చేస్తున్న మూవీపై అంచనాలున్నాయి. కబాలి గురి తప్పినా కాలా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని అంచనా వేశారు. అందుకే కాలాకి పోటీగా ఏ సినిమా రిలీజ్ అవలేదు.

అంచనాలను ఈసారి కూడా అందుకోలేదు కాలా. రజిని ఫ్యాన్స్ కు నచ్చే అంశాలున్నా సినిమా నరేషన్ సాగదీయడం సగటు సిని ప్రేక్షకుడికి నచ్చలేదు. భయపడినంత బీభత్సం ఏమి సృష్టించకుండానే కాలా వచ్చాడు. వచ్చే వారం మాత్రం క్యూ లైన్ లో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news