Gossipsకాలా ఫస్ట్ డే కలక్షన్స్.. ఊహలకు కూడా అందలేదు..!

కాలా ఫస్ట్ డే కలక్షన్స్.. ఊహలకు కూడా అందలేదు..!

సూపర్ స్టార్ రజినికాంత్, పా. రంజిత్ కాంబోలో వచ్చిన సినిమా కాలా. రజిని అల్లుడు ధనుష్ నిర్మించిన ఈ సినిమాలో ఈశ్వరి రావు, హ్యూమా ఖురేషి నటించారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా కబాలి కన్నా బెటర్ అన్న టాక్ వచ్చింది. తెలుగులో యావరేజ్ టాక్ నడుస్తున్నా తమిళనాడులో రజినికాంత్ హంగామా కోసాగుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కబాలి కన్నా తక్కువ ఓపెనింగ్స్ రాబట్టిందని తెలుస్తుంది. కబాలి 90% ఆక్యుపెన్సీ సాధించగా.. కాలా మాత్రం కేవలం 60% ఆక్యుపెన్సీ సాధించింది. 900 థియేటర్స్ లో ఓవరాల్ గా 40% మాత్రమే ఓపెనింగ్స్ రాబట్టిందని తెలుస్తుంది. ఈ లెక్క ప్రకారం చూస్తే కాలా తొలిరోజు తెలుగు రెండు రాష్ట్రాల్లో 4.5 కోట్ల కలక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తుంది.

రనినికాంత్ రేంజ్ కు ఇది చాలా తక్కువే అని చెప్పాలి. రజిని ఇమేజ్ ఇలా డ్యామేజ్ అవుతుందని ఎవరు ఊహించి ఉండరు. కబాలి ఇచ్చిన అవకాశాన్ని సరిగా వాడుకోని రంజిత్ కాలాకి అదే పరిస్థితి ఏర్పడేలా చేశాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news