స్టార్ వార్.. జూన్ 1 ఎందుకింత స్పెషల్..

junt-1st-releasing-movies

స్టార్ సినిమా వస్తుంది అంటే చిన్న సినిమాలు వాటి రిలీజ్ ప్లాన్స్ మార్చుకోవాల్సిందే. సమ్మర్ సీజన్ లో స్టార్ హంగామా ముగిసింది అనుకోగా మే 25న రిలీజ్ అవ్వాల్సిన సినిమాలన్ని ఓ వారం వాయిదా వేసుకుని జూన్ 1న రిలీజ్ అవుతున్నాయి. అనుకోకుండా ఇలా వాయిదా పడినవి ఆరోజు డైరెక్ట్ రిలీజ్ ప్లాన్ చేసినవి చూస్తే ఒకేసారి 4 సినిమాలు మళ్లీ బాక్సాఫీస్ ఫైట్ కు సిద్ధమయ్యాయని తెలుస్తుంది.

మే 25న రావాల్సిన నా నువ్వే వాయిదా పడ్డట్టే అంటున్నారు ఆ సినిమాను జూన్ 1న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక నాగ్, వర్మల కాంబోలో వస్తున్న ఆఫీసర్ సినిమా ఏడో టెక్నికల్ ఇష్యూస్ వల్ల జూన్ 1కే రిలీజ్ అంటున్నారు. ఇక డైరెక్ట్ గా రాజ్ తరుణ్ రాజుగాడు జూన్ 1 న రిలీజ్ అనేశాడు. విశాల్ హీరోగా తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమా తెలుగులో అభిమన్యుడిగా రిలీజ్ చేస్తున్నారు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమా కూడా జూన్ 1నే రాబోతుంది.

ఈ నాలుగు సినిమాల్లో ఏదో జూన్ 1న విజయం సాధిస్తుందో చూడాలి. వర్మ, నాగ్ ల ఆఫీసర్ అంచనాలతో వస్తున్నా ప్రమోషన్స్ అంతగా ఏమి లేవు కాబట్టి పట్టించుకోవట్లేదు. ఇక రాజు గాడు పరిస్థితి అంతంతమాత్రమే. ఎటొచ్చి నందమూరి హీరో లవ్ బోయ్ గా వస్తున్న నా నువ్వే సినిమాపై అందరి ఫోకస్ ఉంది. ఆ సినిమా ట్రైలర్ కూడా 24 గంటల్లో 7 మిలియన్స్ వ్యూస్ సాధించింది. మరి ఫైనల్ విన్నర్ ఎవరో కాని ఒకేసారి వచ్చి పడిన ఈ సినిమాలు ఎలాంటి ఫలితాలు అందుకుంటాయో చూడాలి.

Leave a comment