మహానటిలో ఆ గడుసుపిల్ల ఎవరో తెలుసా..!

chinna-savitri-in-mahanati-

మహానటి సినిమాలో నటించిన ప్రతి పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. రియల్ పాత్రలను అంతే రియలిస్టిక్ గా చూపించిన దర్శకుడికే కాదు అదే రేంజ్ లో అభినయించిన తారలకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక సావిత్రమ్మగా కీర్తి సురేష్ తన నటనా ప్రతిభను ఆవిష్కరించగా చిన్నప్పటి సావిత్రిగా ఓ గడుసు పిల్ల చేసింది.

సావిత్రి చిన్నప్పుడు ఎంత చలాకీగా ఉండేదో ఆమె పాత్ర ద్వారా చెప్పాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇక సినిమాలో ఆమె పాత్రని నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ మనవరాలు చేయడం విశేషం. సినిమాలో కెవి చౌదరి (సావిత్రి పెదనాన్న)గా రాజేంద్ర ప్రసాద్ నటించారు. ఆ పాత్ర గురించి దర్శకుడు ఆయన ఇంటికి వెళ్లి అడిగే క్రమంలో అక్కడ కుక్కతో ఆడుతున్న రాజేంద్ర ప్రసాద్ మనవరాలిని చూసి సినిమాలో ఆమెను తీసుకుంటామని అన్నారట.

ఇక తాత వారసత్వాన్ని చిన్నతనంలోనే అందిపుచ్చుకున్న ఆ చిన్నది కెమెరా ముందు ఇరగదీసిందట. తాతయ్య సినిమాలు చేస్తూ ఆ సినిమాలోని డైలాగులు చెబుతూ ఇంట్లో అల్లరి చేసేదట. ఆ అల్లరే ఇప్పుడు మంచి అవకాశాన్ని తెచ్చింది. కలకాలం నిలిచే సినిమాలో అద్భుత పాత్ర ఇప్పించింది. సినిమా సక్సెస్ లో భాగంగా రాజేంద్ర ప్రసాద్ తో జరిపిన ఇంటర్వ్యూలో ఆయన మనవరాలు పాల్గొంది ఆమె ఈ విషయాలన్ని చెప్పడం విశేషం.

Leave a comment