ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా డైరెక్టర్ ఎవరో తెలుసా …

ntr next movie

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం కెరీర్‌లోనే తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడు. టెంప‌ర్ – నాన్న‌కు ప్రేమ‌తో – జ‌న‌తా గ్యారేజ్ లాంటి మూడు సూప‌ర్ హిట్ సినిమాల త‌ర్వాత ఎన్టీఆర్ న‌టించిన లేటెస్ట్ మూవీ జై ల‌వ‌కుశ‌. ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఫ‌స్ట్ టైం మూడు పాత్ర‌లు పోషించ‌డం, అన్న క‌ళ్యాణ్‌రామ్ నిర్మాత‌గా, త‌న తాత ఎన్టీఆర్ పేరు మీదున్న ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో న‌టించ‌డంతో జై ల‌వ‌కుశ‌పై రిలీజ్‌కు ముందు భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

నటనాపరంగా ఎక్కువ స్కోప్ ఉన్న సినిమాలకు తారక్ లాంటి వారే అసలైన కథానాయకులని దర్శకులు మరో హీరోలవైపు చూడటం లేదు. ఇప్పటికే జై లవకుశ ని థియేటర్స్ లోకి వదిలిన ఎన్టీఆర్ విజయంవైపు దూసుకువెళుతున్నాడు. అయితే తారక్ నెక్స్ట్ ఎలాంటి సినిమా చేయబోతున్నాడని అందరిలో ఆసక్తిని రేపింది. గత కొంత కాలంగా ఈ హీరో పలు దర్శకులతో కథలను ఒకే చేశాడని రూమర్స్ వస్తున్నాయి. ముఖ్యంగా రాజమౌళి మరియు కొరటాల శివ వంటి వారు చెప్పిన కథలకు తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే తారక్ త్రివిక్రమ్ తో తప్ప ఇంకా ఏ కథలను ఒకే చెయ్యలేదని చెప్పాడు

కాకపోతే ఇన్ని రోజులు బిగ్ బాస్ – జై లవకుశ షూటింగ్స్ లో బిజీ బిజీగా గడిపినందుకు ఒక నెల పాటు ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆ విహార యాత్రల తర్వాత తిరిగి వచ్చాక మాత్రమే మొదలు పెడతాడట తారక్.

Leave a comment