Gossipsఎన్టీఆర్ బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్..?

ఎన్టీఆర్ బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్..?

నందమూరి ఫ్యాన్స్ ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న బాలయ్య, ఎన్.టి.ఆర్ ల కలయిక అరవింద సమేత సక్సెస్ మీట్ లో జరిగింది. ఒకే వేడుకలో.. ఒకే వేదిక మీద ఇద్దరు నట సింహాలు ఆసీన్నులయ్యారు. అలా ఇద్దరిని ఒక చోట చూడాలని కలలు కన్న నందమూరి ఫ్యాన్స్ కోరిక నెరవేరింది. అయితే ఇదే అదునుగా ఎన్.టి.ఆర్ బయోపిక్ లో కూడా ఎన్.టి.ఆర్ ఉండేలా పావులు కదిలిస్తున్నారట.

విశ్వవిఖ్యాత నట సార్వ భౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో ఎన్.టి.ఆర్ బయోపిక్ కు శ్రీకారం చుట్టారు. రెండు పార్టులుగా రాబోతున్న ఈ సినిమాలో బాలయ్య లీడ్ రోల్ చేస్తున్నాడు. అయితే సినిమాలో జూనియర్ ఎన్.టి.ఆర్ కూడా ఉంటే ఆ లెక్క వేరేలా ఉంటుందని.. బిజినెస్ కూడా బాగా జరుగుతుందని భావించి తారక్ ను సినిమాలో భాగం చేస్తున్నారట.

బాలకృష్ణ అనుమతి మేరకే ఎన్.టి.ఆర్ బయోపిక్ లో జూనియర్ కు స్థానం కల్పిస్తున్నారట. ఇదే నిజమైతే నందమూరి ఫ్యాన్స్ కు అంతకంటే శుభవార్త మరోటి ఉండదు. మరి వస్తున్న ఈ వార్తలు ఎంతవరకు వాస్తవం అన్నది త్వరలో తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news