బూతు డైలాగుతో రెచ్చిపోయిన జ్యోతిక…

jothika

బాల ! ఈ సంచలన దర్శకుడి పేరు గుర్తే ఉందిగా .? శివ పుత్రుడు – నేనే దేవుడ్ని వంటి తెలుగులో రిలీజ్ అయిన తమిళ చిత్రాల దర్శకుడు. నిజ జీవితానికి దగ్గరగా సినిమాలు తియ్యడంలో బాలను మించించినవారు మరొకరు ఉండరు. కోలీవుడ్ లో సంచలన దర్శకుడు బాల తెరకెక్కించే సినిమాలు ఏ విధంగా ఉంటాయో సినిమా నాలెడ్జ్ ఉన్నవాళ్లకు బాగా తెలుసు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా బాల చేతిలో పడితే ఇక అంతే. స్టైల్ ని ఇమేజ్ ని మర్చిపోవాల్సిందే.

కథకు తగ్గట్టుగా రియాలిటీని వెండితెరపై చూపించడంలో ఆయనకు ఎవ్వరు సాటిలేరని చెప్పాలి. రోబో దర్శకుడు శంకర్ కూడా ఓసారి బాల స్టైల్ లో సినిమా తీయడం ఈ ప్రపంచంలో ఎవరితరం కాదని చెప్పాడు అంటే బాల ఎంత స్పెషల్ డైరెక్టరో మనకు అర్ధం అవుతుంది. తాజాగా బాల ‘నాచియర్’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. సినిమాలో జ్యోతిక పోలీస్ పాత్రలో నటిస్తోంది. దీనిలో యువ సంగీత దర్శకుడు జీవి.ప్రకాష్ కుమార్ మరో ముఖ్యమైన పాత్రలో మెరుస్తున్నాడు. అతను మురికివాడలో ఉండే యువకుడిగా నటిస్తున్నాడు. తాజాగా బాల టీజర్ ని రిలీజ్ చేశాడు. అయితే అందులో జ్యోతిక చాలా కొత్తగా కనిపిస్తోంది.

ఒక క్రూరమైన కిల్లర్ ఎస్సై పాత్రలో ఖాకీ వేసుకుని నేరస్తులపై ఆమె చేసే ఆరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అదే విధంగా చిన్న చిన్న నేరాలు చేస్తూ పోలీసులకు దొరికిపోయే నేరస్తుడిగా జీవి ప్రకాష్ కనిపిస్తున్నాడు. టీజర్ లో మొత్తంగా ఒకే ఒక్క డైలాగ్ ఉంది. అది కూడా జ్యోతిక చెప్పేసింది. కానీ ఆ డైలాగ్ తమిళ్ లో ఓ బూతుపదం. ‘ల.. కొడకా’ అని లిటరల్ గా తిట్టేసింది జ్యోతిక.

దీంతో కొందరు టీజర్స్ కి కూడా సెన్సార్ ఉండాల్సిందేనని కామెంట్స్ చేస్తున్నారు. కానీ బాల సినిమాలను తమిళ సినీ అభిమానులు చాలా ఇష్టపడతారు. శివ పుత్రుడు – నేనే దేవుడ్ని అలాగే వాడు వీడు తెలుగులో అనువాదమయ్యి ఓ వర్గం ప్రేక్షకులను బాగా ఆకట్టుకొన్నాయి. ఇక ఇప్పుడు నాచియర్ సినిమా కూడా తెలుగులో డబ్ కానుందట. జ్యోతిక డైలాగుతో పాటు ఆమె పెరఫామెన్స్ చూడాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

Leave a comment