Gossips‘జెర్సీ’ఫస్ట్ డే కలెక్షన్స్..!

‘జెర్సీ’ఫస్ట్ డే కలెక్షన్స్..!

భలే భలే మగాడివోయ్ సినిమా తర్వాత వరుస విజయాలు అందుకుంటున్న నాని ఆ మద్య కృష్ణార్జున యుద్దం, దేవదాసు సినిమాలతో నిరాశపరిచాడు. తాజాగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్మురేపింది. మొదటి నుంచి మంచి అంచనాలతో ఈ సినిమా రిలీజ్ అయ్యింది.

నాని జెర్సీ సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకునేలా కనిపిస్తున్నాడు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా మంచి ఓపెనింగ్స్ ను అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 4.6 కోట్ల షేర్స్ అందుకున్న జెర్సీ ఓవర్సీస్ లో 1.70కోట్ల వరకు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక కర్ణాటక లో కోటికి పైగా కలెక్షన్స్ రాగా వరల్డ్ వైడ్ గా 7.12కోట్ల షేర్స్ ను జెర్సీ అందుకుంది.

ఇక జెర్సీకి పోటీగా లారెన్స్ ‘కాంచన 3’ రిలీజయినప్పటికీ నాని సినిమాకు మంచి కలెక్షన్స్ అందుతున్నాయి. జెర్సీ సినిమాకు వస్తోన్న పాజిటివ్ టాక్ వల్ల మిగతా సినిమాల కలెక్షన్స్ కి ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నైజాం: రూ .1.97 కోట్లు
సీడెడ్: రూ 0.40 కోట్లు
వైజాగ్: రూ.
ఈస్ట్: రూ 0.42 కోట్లు
వెస్ట్: Rs. 0.29 కోట్లు
కృష్ణ: రూ 0.34 కోట్లు
గుంటూరు: రూ.
నెల్లూరు: రూ 0.17 కోట్లు

ఏపి, తెలంగాణ: రూ. .4.47 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా: రూ. 1.15 కోట్లు
రెస్ట్ ఆఫ్ వరల్డ్: రూ 1.7 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా: రూ. 7.32 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news