Moviesబోయపాటి బొమ్మ.. బాక్సులు బద్ధలవ్వాల్సిందే..!

బోయపాటి బొమ్మ.. బాక్సులు బద్ధలవ్వాల్సిందే..!

టాలీవుడ్ క్రేజీ డైరక్టర్స్ లో ఊర మాస్ డైరక్టర్ బోయపాటి ఒకరు. స్టార్ డైరక్టర్ అంటే స్టార్స్ తోనే సినిమా తీసి హిట్ కొట్టడం కాదు కొత్త కుర్రాడితో కూడా అదరగొట్టాలి అన్న పంథాలో బోయపాటి బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన జయ జానకి నాయకా కలక్షన్స్ కుమ్మేస్తుంది. లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయిన 3 సినిమాల్లో మొదట 2 డేస్ కలక్షన్స్ లో బోయపాటి సినిమా నెంబర్ 1 గా ఉండటం విశేషం.

వారాంతరంలోనూ బోయపాటి బొమ్మ బాక్సులు బద్ధలు కొట్టేస్తుండటం విశేషం. ఫస్ట్ వీకెండ్ లో 15 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన జయ జానకి నాయకా మూవీ ప్రపంచవ్యాప్తంగా 9.07 కోట్ల షేర్ అందుకుంది. ప్రేమకథలో కమర్షియల్ హంగులద్దిన బోయపాటి శ్రీను మరోసారి తన మాస్ పల్స్ ఏంటో చూపించాడు.

హీరో ఎవరన్నది కాదు దర్శకుడు ఎవరన్నది ముఖ్యం. ఇలా సందర్భాలు చాలా తక్కువగా వస్తాయి. అందుకే బోయపాటి బొమ్మ బీభత్సం సృష్టిస్తుంది. 3 సినిమాల గట్టి పోటీలో వచ్చినా మంచి కలక్షన్స్ తో దూసుకెళ్తుంది బోయపాటి శ్రీను జయ జానకి నాయకా మూవీ. సినిమాలో హీరో డ్యాన్స్ ఫైట్స్ బాగా చేయగా రకుల్ సినిమాకు అదనపు ఆకర్షణ అయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news