స్పీడ్ తగ్గని “జ‌వాన్” 6 డేస్ కలెక్షన్

jawaan

మెగా మేన‌ళ్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా న‌టించిన జ‌వాన్ సినిమా ఈ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ప‌లుసార్లు వాయిదాలు ప‌డుతూ ఎట్ట‌కేల‌కు రిలీజ్ అయిన ఈ సినిమాకు తొలి రోజే మిక్స్‌డ్ టాక్ వ‌చ్చింది. ఈ సినిమాతో పాటు రిలీజ్‌ అయిన గోపీచంద్ ఆక్సిజ‌న్‌, విజ‌య్ ఆంటోనీ డ‌బ్బింగ్ సినిమా ఇంద్ర‌సేన డిజాస్ట‌ర్లు అవ్వ‌డంతో జ‌వాన్‌కు మిక్స్ డ్ టాక్ ఉన్నా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్లే ద‌క్కించుకుంది.

జ‌వాన్ తొలి ఆరు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ 8.13 కోట్ల షేర్ సాధించి ట్రేడ్ వ‌ర్గాల‌ను సైతం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇక వ‌ర‌ల్డ్ వైడ్‌గా జ‌వాన్‌కు తొలి ఆరు రోజుల్లో 9.03 కోట్ల షేర్ వ‌చ్చింది. ఏపీ, తెలంగాణ‌లో జ‌వాన్ ఫ‌స్ట్ వీకెండ్ షేర్ డీటైల్స్ ఇలా ఉన్నాయి.
జ‌వాన్ ఏపీ+తెలంగాణ తొలి ఆరు రోజుల్లో షేర్ = ( రూ. కోట్ల‌లో )

నైజాం – 2.42

సీడెడ్ – 1.54

ఉత్తరాంధ్ర – 1.07

గుంటూరు – 0.97

కృష్ణా – 0.62

ఈస్ట్ – 0.78

వెస్ట్ – 0.45

నెల్లూరు – 0.38

———————————

6 రోజుల షేర్ – 8.13 కోట్లు

Leave a comment