Movies"జవాన్‌" రివ్యూ & రేటింగ్

“జవాన్‌” రివ్యూ & రేటింగ్

రివ్యూ:
చిత్రం: జవాన్‌
నటీనటులు: సాయిధరమ్‌తేజ్‌.. మెహరీన్‌.. ప్రసన్న.. సత్యం రాజేశ్‌.. కోట శ్రీనివాసరావు తదితరులు
సంగీతం: తమన్‌
ఛాయాగ్రహణం: కె.వి.గుహన్‌
ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌
నిర్మాత: కృష్ణ
సమర్పణ: దిల్‌ రాజు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బీవీఎస్‌ రవి
సంస్థ: అరుణాచల్‌ క్రియేషన్స్‌
విడుదల తేదీ: 01-12-2017
ఏడాది కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు సాయిధరమ్ తేజ్. తక్కువ కాలంలోనే ఫుల్ మెచురిటి చూపిస్తూ.. తనకంటూ మార్కెట్ ఏర్పరచుకున్నాడు. ఈ ఏడాది విన్నర్, నక్షత్రం సినిమాలు పెద్దగా కలిసి రాలేదు. అయితే.. ఏడాది చివరలో ఈ డిసెంబర్ ఫస్ట్ వీక్ ఫస్ట్ డేనే జవాన్ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అంతే కాక చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత బివిఎస్ రవి దర్శకత్వంలో వస్తున్న మూవీ జవాన్. ముందునుంచీ టైటిల్ కున్న క్యాచీనెస్ వల్ల, జవాన్ అనే పదానికుండే.. స్ట్రెంత్ వల్ల సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి తేజ్ హిట్టు కొట్టాడా.. రివ్యూలో చూద్దాం..
కథ :
హీరో జై (సాయి) కి DRDO లో ఉద్యోగం చెయ్యడం కల . అయితే ట్రైలర్ లో లా భారీ డైలాగులతో స్టార్ట్ అవ్వదు ఈ సినిమా. జస్ట్, సింపుల్ గా కూల్ గా తేజ్ డ్యాన్స్ లతో , మెహ్రీన్ స్క్రీన్ ప్రెసెన్స్ తో కూల్ గా వెళ్ళిపోతుంది. తీవ్ర వాదుల నుండి DRDO లో ఒక మిస్సైల్ ని జై కాపాడే సన్నివేశంతో సినిమా ఊపందుకుంటుంది. అక్కడి నుండి తన ప్రయత్నాన్ని విఫలం చేసిన హీరో కుటుంబాన్ని అంతు చూస్తానని , విలన్ శపథం చెయ్యడం. అతని ప్రయత్నాల్ని జవాన్ ఎలా తిప్పికోడతాడు అనేదే సినిమా మొత్తం.


విశ్లేషణ-
ఇద్దరు బలమైన, తెలివైన వాళ్ల మధ్య సాగే మైండ్‌ గేమ్‌ కాన్సెప్ట్‌ ఇది. ఒకరికి దేశభక్తి ఉంటే.. ఇంకొకరు తన స్వార్థం కోసం దేశానికి ద్రోహం చేయాలని చూసే వ్యక్తి. ఇది ఒక స్క్రీన్‌ప్లే బేస్డ్‌ కథ. ఒకరిపై ఒకరు వేసుకునే ఎత్తులు.. పై ఎత్తులు ఆసక్తికరంగా ఉంటాయి. ప్రతినాయకుడు ఎప్పుడైతే బలవంతుడవుతాడో అప్పుడే కథానాయకుడిని ఇంకా బలంగా చూపించే అవకాశం ఉంటుంది. ఈ కథలో ఆ అవకాశం దక్కింది. హీరో-విలన్ల మధ్య జరిగే సన్నివేశాలు ఈ కథకు బలం. వాటిని దర్శకుడు చక్కగా రాసుకొన్నాడు. ఆక్టోపస్‌ మిసైల్‌ ప్రతినాయకుడికి దక్కకుండా కథానాయకుడు చేసే ప్రయత్నాలు, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసే పోరాటం ఆకట్టుకుంటాయి. ద్వితీయార్ధం మొత్తం హీరో-విలన్ల మధ్యే సాగుతుంది. సాధారణంగా కథానాయకుడు.. ప్రతినాయకుడి ఇంట్లోకి వెళ్లి అక్కడి నుంచి కథను నడిపిస్తుంటాడు. కానీ, అందుకు భిన్నంగా ఇందులో కథానాయకుడి ఇంట్లోకి ప్రతినాయకుడు వచ్చి చేరతాడు. శత్రువు ఇంట్లో ఉన్నా సరే అతని గురించి తెలుసుకోవడానికి పోరాడుతుంటాడు కథానాయకుడు. వాటికి సంబంధించిన సన్నివేశాల్లో లాజిక్‌ ఎక్కడా మిస్‌ కాకుండా దర్శకుడు బీవీఎస్‌ రవి రాసుకోగలిగాడు. హీరోకు విలన్‌ ఎప్పుడు దొరుకుతాడన్న ఆసక్తి కలిగించాడు. అయితే ప్రధాన కథకు హీరో ప్రేమ కథ బ్రేక్‌లు వేస్తుంటుంది. పాటల పరిస్థితీ అంతే. సరదాగా నవ్వుకోవడానికి ఒక్క సన్నివేశం కూడా లేదే అనిపిస్తుంది. విశ్రాంతి ముందు ఘట్టం, విలన్‌ను హీరో పట్టుకునే యత్నాలు దర్శకుడి ప్రతిభకు అద్దం పడతాయి. అయితే ఆక్టోపస్‌ మిసైల్‌, ప్రాజెక్టు 3 తదితర వ్యవహరాలు సామాన్య ప్రేక్షకుడికి కొంచెం అర్థం కాకపోవచ్చు. పతాక సన్నివేశాలు ఇంకాస్త ఇంటెలిజెంట్‌గా తీర్చిదిద్ది ఉంటే బాగుండేది.
నటీనటులు :
సాయి ధరం తేజ్ తో మొదలుపెట్టాలి. ఇన్ని రోజులు సాయి ధరం తేజ్ మీద ఒక కంప్లైంట్ ఉండేది. తను కీలక సన్నివేశాల్లో , ఎమోషనల్ సన్నివేశాల్లో సరిగ్గా చెయ్యాల్సి ఉంది అని. ఈ సినిమా తో అభిమానుల ఆకలి తీరిపోతుంది. ఫ్రేము ఫ్రేముకి ఇంప్రూవ్ చేసుకుంటూ సినిమా మొత్తాన్ని తన భుజాల పైన మోసాడు. సినిమాలో అతి తక్కువగా ఉండే కామెడీ సన్నివేశాల్లో కూడా ఈజీ గా రాణించాడు.
మెహ్రీన్, ఈ సినిమాతో మళ్ళి హిట్ కొట్టింది. కాసింత అందాల ఆరబోతతో కుర్రకారుకి మతి పోగొట్టింది అనే చెప్పాలి. అయితే , సినిమాలో ఆమె పాత్రకు ఉన్న కాసింత స్కోప్ ని కూడా ఎంతో బాగా హేండిల్ చేసింది అనుకోవాలి.
ఇక పొతే సినిమాలో షాకింగ్ ఫాక్టర్ విలన్ గా నటించిన ప్రసన్న. అతని పేస్ విలన్ కి సెట్ కాదు అని ఫిక్స్ అయ్యే థియేటర్ కి వెళ్తాం. కాని, అతని నటనతో సినిమాని ని మరో లెవల్ కి తీసుకేల్లడనే చెప్పాలి.
ఉన్నది కాసేపైనా కోటా శ్రీనివాస రావు గారు, మిగతా నటులు అలరించారు.
బలాలు :
సాయి ధరం తేజ్
స్క్రీన్ ప్లే
మెహ్రీన్
ఇంటర్వెల్ బ్యాంగ్
విలన్ గా ప్రసన్న నటన
బలహీనతలు :
– ఎంటర్ టైన్మెంట్ అంశాలు కాసింత తక్కువగా ఉండటం.
-సినిమా దాదాపు థ్రిల్లర్ మూడ్ లో సీరియస్ గా వెళ్ళిపోవడం.
-అక్కడక్కడ లాజిక్ మిస్ అవ్వడం.
– పాటలు
రివ్యూ & రేటింగ్ : 2.75
చివరిగా: ‘జవాన్‌’ ప్రేక్షకులకు ఒక త్రిల్లింగ్ మూవీ.

https://www.youtube.com/watch?v=q01XMysH2Y0

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news