Movies‘జనతా గ్యారేజ్’ వరల్డ్‌వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ రిపోర్ట్

‘జనతా గ్యారేజ్’ వరల్డ్‌వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ రిపోర్ట్

Young tiger NTR and Koratala Siva’s sensational blockbuster movie ‘Janatha Garage’ closing worldwide collections report has been revealed by trade reports. see below figures how much it collected.

యంగ్‌టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతాఇంతా కాదు. కొన్ని చోట్ల ‘బాహుబలి’ని వెనక్కు నెట్టేసి ఆల్‌టైమ్ రికార్డులు క్రియేట్ చేసిన ఈ చిత్రం.. మిగిలిన ఏరియాల్లో ‘నాన్-బాహుబలి’ రికార్డ్స్ బద్దలుకొట్టేసింది. ఇంకా ఎన్నో ఘనతలు సాధిస్తూ.. చివరికి టాలీవుడ్ ఆల్‌టైం రికార్డ్ సినిమాల జాబితాలో మూడోస్థానం సంపాదించుకుంది.

ఆ తర్వాత ఇతర సినిమాలు వరుసగా రిలీజ్ అవ్వడం, దాంతో ఈ మూవీని థియేటర్ల నుంచి తొలగిస్తూ రావడంతో.. కలెక్షన్లు తగ్గుతూ వచ్చాయి. ఫైనల్‌గా వందరోజులు కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద తన కలెక్షన్ల పరుగును నిలిపేసింది. దీంతో.. ట్రేడ్ వర్గాలు తాజాగా వరల్డ్‌వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ రిపోర్ట్‌ని ఏరియాల వారీగా (కోట్లలో) వెల్లడించింది. ఆ వివరాలు కింద విధంగా ఉన్నాయి.

నైజాం : 19
సీడెడ్ : 12
వైజాగ్ : 7.60
గుంటూరు : 6.10
ఈస్ట్ గోదావరి : 4.95
వెస్ట్ గోదావరి : 4.30
కృష్ణా : 4.40
నెల్లూరు : 2.35
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ. 60.70 కోట్లు (షేర్) (రూ.95.50 కోట్లు గ్రాస్)
కర్ణాటక : 8
యూఎస్ఏ : 7.30
రెస్టాఫ్ వరల్డ్ : 2
రెస్టాఫ్ ఇండియా : 1.33
తమిళనాడు : 1.10
కేరళ : 1.80
టోటల్ వరల్డ్‌వైడ్ : రూ.82.23 కోట్లు (రూ. 137 కోట్లు గ్రాస్)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news