సైరా కోసం జేమ్స్ బాండ్ ఫైటర్.. మరో బాహుబలి పక్కానా..!

james-bond-fighter-for-sye-

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా రాబోతున్న సైరా నరసింహారెడ్డి సినిమా ప్రస్తుతం యాక్షన్ పార్ట్ షూటింగ్ జరుపుకుంటుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా వస్తున్న ఈ సినిమాలో పోరాట ఘట్టాలు కూడా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చేలా చేస్తాయట. ఇక దీనికోసం హాలీవుడ్ ఫైట్ కంపోజర్ ను తీసుకురావడం జరిగింది.

జేంస్ బాండ్ సీరీస్ స్కై పాల్ కు యాక్షన్ కపోజింగ్ చేసిన గ్రేగ్ పావెల్ సైరా సినిమాకు పనిచేస్తున్నారట. సినిమాలో నరసింహారెడ్డి తెల్లవాళ్ల దగ్గర నుండి గన్స్ తెచ్చుకునే ఫైట్ సీక్వెన్స్ ఒకటి ఉంటుందట. దీనికోసం సురేందర్ రెడ్డి క్రేజీ ఫైట్ సీక్వెన్స్ అనుకోగా గ్రేగ్ సాయంతో దాన్ని షూట్ చేస్తున్నారట. హాలీవుడ్ తో పాటుగా బాలీవుడ్ లో 2,3 సినిమాలు చేసిన గ్రేగ్ పావెల్ సైరాకు పనిచేస్తుండటం గొప్ప విషయమని చెప్పొచ్చు.

ఈ సినిమాలో ఇప్పటికే అమితాబ్, సుదీప్, జగపతి బాబు, విజయ్ సేతుపతి లాంటి స్టార్స్ ఉన్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న సైరా 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ, హింది బాషల్లో తెరకెక్కుతుంది. మరి జేమ్స్ బాండ్ యాక్షన్ ఫైటర్ సైరా కోసం ఎలాంటి కస్రత్తులు చేస్తున్నాడో చూడాలి.

Leave a comment