శ్రీనివాస్ రెడ్డి ” జంబ లకిడి పంబ ” పబ్లిక్ టాక్..!

jambalikadipamha-public-talk

శ్రీనివాస్ రెడ్డి, సిద్ధి ఇద్నాని లీడ్ రోల్ లో చేసిన సినిమా జంబ లకిడి పంబ. మురళి కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను జోజో జోస్ నిర్మించారు. ఈవివి డైరక్షన్ లో వచ్చి సూపర్ హిట్ కొట్టిన జంబ లకిడి పంబ టైటిల్ తో అదే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలో శ్రీనివాస్ రెడ్డి నటన బాగుందని అంటున్నారు.

దర్శకుడు కథ కొత్తగా రాసుకున్నా దానికి తగినట్టు కథనం అందించలేదని టాక్. మొదటి భాగమే బోర్ కొట్టేస్తుందని అంటున్నారు. ఇక ఈ సినిమా పబ్లిక్ టాక్ కామెడీ బాగుందని అంటున్నారు. శ్రీనివాస్ రెడ్డి నటన గురించి అందరు ప్రస్థావిస్తున్నారు. వెన్నెల కిశోర్ కూడా బాగా చేశాడని చెబుతున్నారు. గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్మురా సినిమా తర్వాత శ్రీనివాస్ రెడ్డి హీరోగా చేసిన సినిమా ఈ జంబ లకిడి పంబ. మరి ఆ సినిమా రేంజ్ హిట్ అవుతుందో లేదో చూడాలి.

Leave a comment