జంబలకిడి పంబ ట్రైలర్.. కామెడీ దంచి కొట్టినట్టు ఉన్నారు..!

jambalakidi-pamba-trailer

శ్రీనివాస్ రెడ్డి హీరోగా సిద్ధి ఇద్నాని హీరోయిన్ గా వస్తున్న సినిమా జంబలకిడి పంబ. ఈవివి సత్యనారాయణ తీసిన జంబలకిడి పంబ ఎంత పెద్ద సూపర్ హిట్టో తెలిసిందే. ఆ సినిమా టైటిల్ తో వెరైటీ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా ఈ జంబలకిడి పంబ. ఈ నెల 22న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయ్యింది.

మురళి కృష్ణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను రవి, జోజో జోస్, శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా పాత జంబలకిడి పంబ కాన్సెప్ట్ లానే హీరో క్యారక్టర్ అమ్మాయిలా, హీరోయిన్ క్యారక్టర్ అబ్బాయిలా ప్రవర్తిస్తుంది. మరి ఈ సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్న మోడ్రెన్ జంబలకిడి పంబ ఎలా ఉండబోతుందో చూడాలి.

గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కామెడీ హీరోగా కెరియర్ కొనసాగించాలనుకుంటున్న శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న ఈ మలి ప్రయత్నం ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.

Leave a comment