సీడెడ్ లో రికార్డు స్థాయలో జై సింహ బిజినెస్ …రేటు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

jai simha seeded rights
నందమూరి హీరో బాలయ్య లేటు వయసులోనూ ఏమాత్రం తగ్గడంలేదు .. కుర్ర హీరోల తో పోటీ పడుతూ.. వరుస సినిమాలతో బాలయ్య దూసుకుపోతున్నాడు. సంక్రాంతి బరిలో నిలిచేందుకు సిద్దమవుతున్న ఈ సినిమా మిగిలిన స్టార్ హీరోల సినిమాలకు కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. ఇప్పటికే ఈ సినిమా స్టిల్స్ అభిమానులందరినీ అలరిస్తున్నాయి. దీంతో పాటు ఈ సినిమా బిజినెస్ కూడా బాలయ్య రేంజ్ లోనే సునామి సృష్టిస్తోంది.
జై సింహ సినిమా.. ఇప్పటికే అన్ని చోట్ల మంచి బిజినెస్ చేయగా సీడెడ్ లో మాత్రం భారీ స్థాయిలో ఈ సినిమాకి బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికే జై సింహ సినిమా సీడెడ్ ఏరియాలో  8.4 కోట్ల కు అమ్ముడైనట్టు తెలుస్తోంది . ఈ ఆఫర్ రాకముందు ఈ సినిమాని సొంతంగా రిలీజ్ చెయ్యాలని భావించిన నిర్మాత ఇంత భారీ ఆఫర్ఆ రావడంతో … ఆ ఆఫర్ఫ కి ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. బాల‌య్య స‌ర‌స‌న న‌య‌న‌తార ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. గ‌త‌ సంక్రాంతికి గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య ఈసారి త‌న‌కు క‌లిసొచ్చిన సింహాతో ‘జైసింహ’గా ప్రేక్ష‌కుల ముందుకు దిగుతున్నాడు.

Leave a comment