Movies"జై సింహా" ప్రీ - రివ్యూ

“జై సింహా” ప్రీ – రివ్యూ

నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా జై సింహా. సి.కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. హరిప్రియ, నటాషా దోషిలు కూడా సినిమాలో ముఖ్య పాత్రలు పోశిస్తున్నారు. ఎం.రత్నం కథా మాటలు అందించిన ఈ సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచనాలు సృష్టిస్తుందో చూడాలి.

బాలయ్య మాస్ యాక్షన్ సినిమాలంటే నందమూరి అభిమానులకే కాదు సిని ప్రేమికులకు ఇష్టమే. లెజెండ్ తర్వాత కొద్ది పాటి గ్యాప్ తో డిఫరెంట్ సినిమాలు చేసిన బాలయ్య పక్కా మాస్ మసాలాగా తీసిన సినిమా జై సింహా. సినిమాకు అన్ని మంచి సెంటిమెంట్ కలిసి వస్తుంది. సమరసిం హారెడ్డి, నరసింహ నాయుడు సినిమాల రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.

నయనతార తన నటనతో ఆకట్టుకుంటుందన్ తెలుస్తుంది. ఇక హరిప్రియ పాత్ర చాలా కీలకం అని అంటున్నారు. సినిమాపై దర్శక నిర్మాతల మాట ఏంటంటే కచ్చితంగా సినిమా బాలయ్య ఫ్యాన్స్ కు పండుగ ముందే తెస్తుందని అంటున్నారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బలంగా ఉంటాయని తెలుస్తుంది. చిరంతన్ భట్ మ్యూజిక్ ప్లస్ అవుతుందని.. అయితే సినిమాలో యువ హీరోలకు పోటీగా బాలయ్య డ్యాన్స్ వేశాడని అంటున్నారు.

ఎలాగు రేసులో ఉన్న అజ్ఞాతవాసి నెమ్మదిగా వెళ్తుండగా జై సిం హాతో బాలయ్య సూపర్ హిట్ అందుకుంటాడని అంటున్నారు. ఓ పక్క సూర్య గ్యాంగ్ కూడా రేపు రిలీజ్ అవుతుండగా తెలుగులో మాత్రం జై సిం హా మీద అదరి ఫోకస్ ఉంది.

http://www.telugulives.com/telugu/balayya-target/

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news