Gossipsఅయ్యో బాలయ్య ... ఇప్పుడు నీ పరిస్థితి ఏంటయ్యా...?

అయ్యో బాలయ్య … ఇప్పుడు నీ పరిస్థితి ఏంటయ్యా…?

చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలతో పోటీ పడి నటించడమే కాదు తన నటనతో అందరిని మెప్పించాడు నందమూరి నట సింహం బాలయ్య. చిరంజీవి తరువాత తెలుగు ఇండస్ట్రీ లో నెంబర్ 2 హీరో గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తన గంభీరమైన స్వరం తో తనకు మాత్రమే సాద్యమైన డైలాగ్స్ తో మాస్ ఆడియన్స్ ను తన వైపు తిప్పుకున్నాడు. అంతే కాకుండా ఫ్యాక్షన్ సినిమాలకూ పెట్టింది పేరుగా మంచి పేరు సంపాదించుకున్నాడు. సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు వంటి సినిమాల తో ఫ్యాక్షన్ అంటే ఏంటో .. అసలు ఫ్యాక్షన్ లీడర్ అంటే ఇలాగే ఉంటాడా అనే రేంజ్ లో బాలయ్య నటన అదరగొట్టేసాడు.

బాలయ్య సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానుల కోలాహలం మాములుగా ఉండదు. ఈ మధ్య వచ్చిన సింహా, లెజెండ్ వంటి చిత్రాలతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అంతే కాకుండా హిస్టారికల్ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి లో నటించి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. అయితే ఇంతటి ట్రాక్ రికార్డు, ఇంతటి ఫాలోయింగ్ ఉన్న బాలయ్య సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్లోలో జరగాలి కాని, తన తాజా సినిమా జై సింహా కు మాత్రం అది జరగడం లేదు.

ఈ మధ్య వచ్చిన పైసా వసూల్ సినిమా బాక్సాఫీసు వద్ద బోర్లా పడింది. బాలయ్య మీద నమ్మకంతో … ఈ సినిమాను ఎక్కువ రేటు పెట్టి కొన్న డిస్టిబ్యూటర్లు భారీగా నష్టాలను చవి చూసారు. ఆ ప్రభావం ఇప్పడు బాలయ్య తాజా సినిమా జై సింహా మీద పడింది. ఈ సినిమా కొనేందుకు బయ్యర్లు తీవ్రంగా ఆలోచిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news