Gossipsచెప్పింది చేసి చూపించిన జై సింహా నిర్మాత..!

చెప్పింది చేసి చూపించిన జై సింహా నిర్మాత..!

టాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరైన సి.కళ్యాణ్ చిన్నా పెద్ద అనే తేడా లేకుండా యువ హీరోలతో పాటుగా స్టార్ సినిమాలు తీసుకుంటూ వచ్చాడు. పరమవీరచక్ర తర్వాత పెద్ద సినిమాల జోలికి వెళ్లని కళ్యాణ్ రీసెంట్ గా బాలయ్య బాబుతో జై సింహా తీసి హిట్ అందుకున్నాడు. నిర్మాతగా చందమామ హిట్ తర్వాత కళ్యాణ్ కు కమర్షియల్ సక్సెస్ అందించిన సినిమా జై సింహానే అని చెప్పొచ్చు.
సంక్రాంతి బరిలో వచ్చిన ఈ సినిమా బాలయ్య మార్క్ ఎంటర్టైనర్ గా నందమూరి ఫ్యాన్స్ ను అలరిస్తుంది. అయితే పోటీగా వచ్చిన అజ్ఞాతవాసి డీలా పడటంతో జై సింహాకు కలిసి వచ్చింది. మహేష్ ఖలేజా సినిమా నిర్మాణంలో భాగాస్వామి అయిన కళ్యాణ్ ఆ తర్వాత ఆటాడిస్తా, ఎటాక్, ఎటోవెల్లిపోయింది మనసు, జ్యోతిలక్ష్మి సినిమాలు తీశారు.
సినిమాలు చేస్తున్నా సరే అవి అంతగా హిట్ అందుకోలేదు. ఇక జై సింహా గురించి ముందునుండి కాన్ఫిడెంట్ గా ఉన్న కళ్యాణ్ సినిమా ప్రమోషన్స్ లో పక్కా హిట్ అని చెప్పింది ఇప్పుడు నిజమైంది. సినిమా పాతిక కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా కలక్షన్స్ ఆ మార్క్ దాటేశాయని తెలుస్తుంది. శాటిలైట్ డబ్బింగ్ రైట్స్ అన్ని కలిపితే కళ్యాణ్ కు ఈ సినిమా మంచి లాభాలే తెచ్చిపెట్టిందని తెలుస్తుంది.http://www.telugulives.com/telugu/jai-simha-10-days-collections/

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news