జై సింహా థియేటర్ కౌంట్..! బాలయ్య భీభత్సం ఇది ..!

నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా జై సింహా. ఈ సినిమా ఈ నెల 12న రిలీజ్ అవుతుంది. ఓ పక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసిగా వస్తుండగా బాలయ్య కూడా తెలుగు రెండు రాష్ట్రాల్లో 750 నుండి 800 థియేటర్ల దాకా వస్తున్నాడని తెలుస్తుంది. బాలయ్య మార్క్ సినిమాగా జై సింహా మాస్ ఆడియెన్స్ కు పక్కా నచ్చేస్తుందని అంటున్నారు.

నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా సినిమా ఫలితం మీద చిత్రయూనిట్ అంతా పూర్తి నమ్మకంతో ఉన్నట్టు తెలుస్తుంది. సినిమా అంచనాలను అందుకుంటే సంక్రాంతి రాజు బాలయ్యే అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. సి.కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమాలో నయనతార, హరిప్రియ, నటాషా దోషి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

చిరంతన్ భట్ మ్యూజిక్ అందించిన ఈ జై సింహాతో బాలయ్య తన హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు. ఎలాగు భారీ థియేటర్లలోనే వస్తుంది కాబట్టి సినిమా టాక్ బాగుంటే సినిమా సూపర్ హిట్ కొట్టినట్టే.

Leave a comment