Gossips" జై సింహ " 2 డేస్ కలెక్షన్స్... గర్జించిన...

” జై సింహ ” 2 డేస్ కలెక్షన్స్… గర్జించిన సింహం

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన లేటెస్ట్ మూవీ జై సింహా. బాల‌య్య సంక్రాంతి సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తూ శుక్ర‌వారం రిలీజ్ అయిన ఈ సినిమా ప‌ర్వాలేద‌న్న టాక్ తెచ్చుకుంది. జై సింహా బాల‌య్య అభిమానుల‌ను బాగా మెప్పించ‌డంతో పాటు బీ, సీ సెంట‌ర్ల‌లోనూ, మాస్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా ఉండ‌డంతో ఈ సినిమాకు తొలి రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా మంచి వ‌సూళ్లే వ‌చ్చాయి.

జై సింహాలో బాల‌య్య మార్క్ యాక్ష‌న్‌, డైలాగులు, ఫైట్స్ హైలెట్ అయ్యాయి. ఫ‌స్టాఫ్‌తో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమాలో సెకండాఫ్ అంచ‌నాలు అందుకోలేక‌పోవ‌డం కాస్త మైన‌స్ అయ్యింది. అయినా సినిమా ప‌ర్వాలేద‌ని మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వ‌డంతో పాటు ఈ సినిమా తొలి రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ 8.25 కోట్ల కోట్లు కొల్ల‌గొట్టింది.అజ్ఞాతవాసి కి నెగటివ్ టాక్ రావడంతో జై సింహ కి లాభమని చెప్పాలి.రెండొవ రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ 14.24 కోట్ల రాబట్టింది. ఈ సినిమా ఏరియా వైజ్ వ‌సూళ్లు ఇలా ఉన్నాయి.

జై సింహా సెకండ్ డే ఏరియా వైజ్ షేర్ ( రూ.కోట్ల‌లో )

నైజాం – 1.66

సీడెడ్ – 1.78

వైజాగ్ – 0.90

గుంటూరు – 1.65

కృష్ణా – 0.76

ఈస్ట్ – 1.85

వెస్ట్ – 1.81

నెల్లూరు – 0.87

క‌ర్ణాట‌క – 1.60

ఓవ‌ర్సీస్ – 0.55

రెస్టాఫ్ వ‌ర‌ల్డ్ – 0.42

టోట‌ల్ ఫ‌స్ట్ డే షేర్ = 14.24 కోట్లు

http://www.telugulives.com/telugu/jai-simha-review/

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news