Moviesజై లవకుశ సెకండ్ టీజర్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ...

జై లవకుశ సెకండ్ టీజర్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ట్రీట్ ఆరోజే..!

జై లవకుశ నుండి వచ్చిన జై టీజర్ సినిమా మీద ఎలాంటి అంచనాలను పెంచేసిందో తెలిసిందే. మొట్టమొదటిసారి ప్రతినాయకుడిగా తారక్ తన నట విశ్వరూపం చూపించాడని చెప్పాలి. టీజర్ లోనే ఈ రేంజ్ కనిపిస్తే ఇక సినిమా మొత్తం ఎలా ఉండబోతుందో అర్ధం చేసుకోవచ్చు. జై టీజర్ తో ఫ్యాన్స్ ను ఉత్తేజపరచిన తారక్ ఈసారి మరో టీజర్ తో రాబోతున్నాడు.

లవకుమార్ ఫస్ట్ లుక్ వచ్చింది టీజర్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్.. అందుకే లవకుమార్ టీజర్ తో జై లవకుశ సెకండ్ టీజర్ రిలీజ్ అవబోతుంది. ఈ నెల 25న వినాయక చవితి స్పెషల్ గా జై లవ కుశ నుండి రెండో టీజర్ రిలీజ్ అవబోతుంది. మరి లవ కుమార్ గా తారక్ ఎలాంటి సర్ ప్రైజ్ ఇస్తాడో చూడాలి. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ జై లవకుశ బాబి డైరక్షన్ లో వస్తుండగా రాశి ఖన్నా, నివేథా థామస్ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సెప్టెంబర్ 21న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా దసరా రేసులో విన్నర్ గా నిలవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news