చిరు రికార్డ్స్ కు ఎసరు పెట్టిన ఎన్టీఆర్….ఇంకా ఎన్ని కొట్లో తెలుసా!

ntr chiru pj

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సంచలనం జై లవ కుశ రిలీజ్ కి ముందే భారీ అంచనాలను సొంతం చేసునుంది . సెప్టెంబర్ 21 రిలీజ్ అయినా ఈ చిత్రం కేవలం ఎన్టీఆర్ అభిమానులనే కాకా తెలుగు సినీ ప్రేక్షకులందరిని మంత్రముగ్దులను చేసిందని చెప్పడం లో అతిశయోక్తి లేదు. యంగ్ టైగర్ యాక్టింగ్ ముందు అన్ని అనుమానాలు పటాపంచలయ్యాయి . బాబీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గ నిలిచిందని చెప్పాలి .
ఈ సినిమా ఇప్పుడు మెగాస్టార్ రికార్డ్స్ కు ఎసరు పెట్టింది .

మెగా స్టార్ చిరంజీవి కం బ్యాక్ మూవీ ఖైదీ 150 ఎలాంటి రికార్డ్స్ ని క్రీయేట్ చేసిందో తెలిసిందే. టోటల్ రన్ లో ఈ చిత్రం 164 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వసూల్ చేసింది . ఈ సినిమా బాహుబలి తర్వాత స్తానం సొంతం చేసుకుంది .మరే హీరో ఈ రెకార్డ్ ను చేరుకోలేక పోయారు ఇప్పటివరకు . అయితే తాజాగా ఎన్టీఆర్ జై లవ కుశ తో ఆ రికార్డు కు టెండర్ పెట్టేసారు . ఇప్పటివరకు ఈ సినిమా 3 వ స్తానం లో నిలిచి శ్రీమంతుడిని క్రాస్ చేసినట్లు తెలుస్తుంది . 162 కోట్ల గ్రాస్ తో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం దూసుకుపోతుందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక కేవలం మరో 2 కోట్లు కలెక్ట్ చేస్తే ఖైదీ 150 ని కూడా క్రాస్ చేసేస్తోంది ఈ చిత్రం.

టోటల్ రన్ లో ఈ చిత్రం 166 + కోట్ల గ్రాస్ వసూల్ చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా. నందమూరి కళ్యాణ్ రామ్ ప్రొడ్యూసర్ గ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం లో నివేద థామస్ , రాశి ఖన్నా హీరోయిన్లు గ నటించారు .

Leave a comment