చివరి పావుగంట అరాచకమే.. జై లవ కుశపై క్రేజీ టాక్..!

jai lava kusa super scean
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బాబి కాంబినేషన్ లో వస్తున్న సినిమా జై లవ కుశ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాను కళ్యాణ్ రాం నిర్మించారు. రాశి ఖన్నా, నివేథా థామస్ హీరోయిన్స్ గా నటించారు. తమ్ముడి కోసం ఎక్కడ కాంప్రమైన్ కాకుండా ఈ సినిమాను నిర్మించారట కళ్యాణ్ రాం.
ఇక ఈ సినిమా సెన్సార్ ఇంకా ప్రీ రివ్యూ రిపోర్ట్ ప్రకారం సినిమాలో తారక్ మూడు పాత్రల్లో ఇరగ్గొట్టేశాడని అంటున్నారు. ముఖ్యంగా జై పాత్రలో ఎన్.టి.ఆర్ నటనకు మాటలే ఉండవని టాక్. జై పాత్రతో ఎన్.టి.ఆర్ నట విశ్వరూపంతో పాటుగా తన ఖలేజా కూడా చూపిస్తాడని అంటున్నారు. ఇక మిగిలిన లవ, కుశ పాత్రల్లో కూడా ఎన్.టి.ఆర్ తనదైన శైలిలో ఆకట్టుకుంటారట.
లవ మంచి వాడిగా కనిపిస్తుండగా.. కుశ చిలిపి దొంగగా అలరిస్తాడట. ఇక జై మాత్రం నాటకాల పిచ్చి ఉన్నా అందులోనూ రావణ రాక్షసత్వం మాత్రమే ఇష్టపడతాడట. ముగ్గురు ఎన్.టి.ఆర్ లు ఫ్యాన్స్ కు పూనకాలు తెచ్చేలా చేస్తారట. ఇక సినిమాలో ముఖ్యంగా క్లైమాక్స్ మాత్రం అరాచరకమే అంటున్నారు. చివరి 15 నిమిషాలు సినిమాకే హైలెట్ అంటున్నారు. కచ్చితంగా ఫ్యాన్స్ కు జై లవ కుశ పెద్ద పండుగ తెస్తుందని ఫిల్మ్ నగర్ టాక్.

Leave a comment