దసరా బరిలో దుమ్మురేపుతున్న ఎన్టీఆర్… 9 వ రోజు కలెక్షన్స్

jai lava kusa 9days collections

టెంపర్ , నాన్నకు ప్రేమతో  , జనతా గ్యారేజ్ వరుసగా 3  సూపర్  హిట్స్ తో దూసుకు పోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్  ఈ సారి జై లవ కుశ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు . ఈ సినిమా సక్సెసఫుల్ గ 10 వ రోజుకి చేరుకుంది . ఈ సినిమా రీలీజ్ అయినా తొలిరోజునుండి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. ఎన్టీఆర్ కెరీర్ లో ఫాస్టెస్ట్ 100 క్రోర్స్ గ్రాసర్ గ జై లవ కుశ నిలిచింది .

పక్క రాష్ట్రమైన కర్ణాటకలో ఈ సినిమా రికార్డు కలెక్షన్స్ రాబడుతుంది . అక్కడ హైయెస్ట్ షేర్ కలెక్షన్స్ సాధించిన సినిమా గ రికార్డు సాధించింది మన జై లవ కుశ. దేశరా సెలవలు కలిసిరావడంతో 9 వ రోజుకు గాను ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 2.2 కోట్లు షేర్ కలెక్షన్స్ రాబట్టిందని  సమాచారం. మొత్తం 9 రోజులకు గాను 70.01 కోట్ల షేర్ వసూల్ చేసింది . ఇక గ్రాస్ కలక్షన్స్ విషయానికి వస్తే 113 కోట్లు పై మాటే అంటున్నారు ట్రేడ్ పండితులు .

9 వ రోజు 80 % థియేటర్లుహౌస్ ఫుల్ అయ్యాయని సమాచారం . ఇదే స్పీడ్ కొనసాగిస్తే  మరో 4  రోజులలో డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ జోన్ కి వచ్చే అవకాశం ఉందని  ట్రేడ్ వర్గాల  విశ్లేషణ .

Leave a comment