Gossipsరాజమౌళి కొడుకు పెళ్లిలో..జై బాలయ్య అని రచ్చ చేసిన ఎన్టీఆర్..!

రాజమౌళి కొడుకు పెళ్లిలో..జై బాలయ్య అని రచ్చ చేసిన ఎన్టీఆర్..!

రాజమౌళి తనయుడు కార్తికేయ వెడ్డింగ్ ఈవెంట్ కు స్టార్ కలరింగ్ అదిరిపోయింది. ఈవెంట్ లో భాగంగా స్టార్స్ అంతా జైపూర్ వెళ్లారు. ఏదో ఇలా వెళ్లి అలా రాకుండా 3 రోజులు అక్కడే ఉండి పెళ్లి పనులలో కూడా తమ వంతు సహకారం అందించారు మన స్టార్స్. ఇది ఓ రకంగా రాజమౌళి మీద వారికి ఉన్న అభిమానం అని చెప్పొచ్చు. ప్రభాస్, ఎన్.టి.ఆర్, రాం చరణ్, నాగార్జున, నాని, అఖిల్, రానాలు ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్ లో ఎన్.టి.ఆర్ హంగామా అంతా ఇంతా కాదని తెలుస్తుంది.

అసలే దగ్గరవాళ్ల దగ్గర అల్లరిగా ఉండే తారక్ పెళ్లి వేడుకలో హంగామా అంతా తానే చేయాలి అన్నట్టుగా అదరగొట్టాడట. స్టార్స్ అంతా ఒక్కసారిగా చిన్నపిల్లల్లా ఆటపాటలతో అదరగొట్టారట. ఇక ఈ క్రమంలోనే అఖిల్ తో డ్యాన్స్ చేస్తున్న ఓ సందర్భంలో జై బాలయ్య అని ఎన్.టి.ఆర్ అనడం ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది. నందమూరి ఫ్యాన్స్ ముద్దుగా బాలయ్య అని పిలుచుకుని ఆయనికి జై కొట్టడం తెలిసిందే. ఎన్.టి.ఆర్ నోట జై బాలయ్యా అని రావడం ఇదే మొదటిసారి.

బాబాయ్, అబ్బాయ్ ల మధ్య ఈమధ్య సానిహిత్యం బాగా కుదురింది. హరికృష్ణ మరణం వీరిద్దరిని కలిపింది. ఈమధ్య అరవింద సమేత ఈవెంట్ లో బాలకృష్ణ గెస్ట్ గా రాగా ఎన్.టి.ఆర్ బయోపిక్ ఆడియో కు నందమూరి కుటుంబ సభ్యుడిగా ఎన్.టి.ఆర్ అటెండ్ అవడం జరిగింది. ఇలా బాలయ్య, ఎన్.టి.ఆర్ తమ మధ్య ఉన్న అనుబంధంతో తమ ఫ్యాన్స్ ను ఖుషి అయ్యేలా చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news