Newsఆ సమయంలో చనిపోదామనుకుని.. గెంటేసిన స్టూడియోలోనే స్టార్ అయ్యాడు..!

ఆ సమయంలో చనిపోదామనుకుని.. గెంటేసిన స్టూడియోలోనే స్టార్ అయ్యాడు..!

ప్రస్తుతం బుల్లితెర మీద నవ్వుల జల్లులు కురిపిస్తున్న స్టార్ కమెడియన్స్ లో జబర్దస్థ్ గెటప్ శ్రీను ఒకరు. మల్లెమాల వారి జబర్దస్త్ తో అతని లైఫ్ టర్న్ తీసుకుంది. రైతు కుటుంబంలో పుట్టిన శ్రీను ఇంటర్ తోనే చదువు మానేసి ఇళ్లు గడవడం కోసం కష్టపడాల్సి వచ్చిందట. ఇక సినిమాల మీద ఉన్న ఇష్టంతో 2004లో హైదరాబాద్ వచ్చిన శ్రీను అప్పటి నుండి స్టూడియోల చుట్టూ తిరిగాడట.

2007లో అన్నపూర్ణ స్టూడియోస్ లో ఓ షూటింగ్ జరుగుతుండగా తను చూసేందుకు వెళ్లానని.. పనిలో పనిగా భోజనాలు పెడుతుంటే తిన్నానని.. అయితే అక్కడ ఇంచార్జ్ నిన్నెవడు లోపలకు రానిచ్చాడని గల్లా పట్టుకుని గెంటేశాడని.. ఆ టైంలో తాను వారం రోజులు అది తలచుకుని ఏడ్చానని అన్నాడు గెటప్ శ్రీను. ఇక తన స్నేహితుడు మ్యాగీ తనని కష్టాల్లో ఆదుకున్నాడని అన్నారు.

తేజ సినిమా కేక ఆడిషన్స్ లో సెలెక్ట్ అవ్వగా.. తేజ చెప్పింది చేయలేదని నువ్వు ఇప్పుడే ఇలా అయితే షూటింగ్ లో కష్టమని నన్ను సెలెక్ట్ చేసి తీసేశారని.. అయితే ఆ టైంలో ట్యాంక్ బండ్ మీద బుద్దుడిని చూస్తూ అందులో హుస్సేన్ సాగర్ లో దూకి చచ్చిపోదామని అనుకున్నా అని అన్నాడు గెటప్ శ్రీను. మళ్లే ఏదైనా చస్తే ఇంట్లో వాళ్లు బాధపడతారని తెలిసి ఆ ప్రయత్నం విరమించుకున్నా అని అన్నారు.

ఇక జబర్దస్థ్ తనకు లైఫ్ ఇచ్చిందని అందుకే తన ఇంటి పేరు మల్లెమాల నిలయమని పెట్టానని అన్నారు. ఇక సుధీర్, రాం ప్రసాద్ లు తనకు మంచి స్నేహితులని.. సుధీర్ పెళ్లి చేసే బాధ్యత తన మీద ఉందని అన్నాడు శ్రీను. కెరియర్ లో గెలుపోటములు కామన్.. కాని చచ్చిపోవడం కాకుండా చచ్చేంత కష్టపడాలని నేర్చుకున్నా అని అన్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news