దిల్ రాజు ఆఫీస్, ఇంటిపై ఐటీ దాడులు..షాక్ లో సినివర్గం..?

60

సాధారణంగా ఈ మద్య పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యే ముందు ఐటి దాడులు నిర్వహించడం కామన్ అయ్యింది. గతంలో బాహుబలి సినిమా రిలీజ్ ముందు నిర్మాత ఇళ్లపై ఐటీ దాడులు నిర్వహించారు. రేపు ప్రపంచ వ్యాప్తంగా మహేష్ బాబు నటించిన ‘మహర్షి’సినిమా రిలీజ్ అవుతుంది.

ఈ నేపథ్యంలో ప్రముఖ తెలుగు సినీ నిర్మాత దిల్ రాజు కు ఈరోజు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. హైదరాబాద్ లోని దిల్ రాజు ఇంటితో పాటు ఆయన కార్యాలయంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఐటీ అధికారులు బృందాలుగా విడిపోయిన దిల్ రాజు ఇంటితో పాటు ఆఫీసులను రికార్డులను పరిశీలించారు.

కాగా, మహేశ్ బాబు హీరోగా నటించిన మహర్షికి సినిమాకు దిల్ రాజు సహ-నిర్మాతగా వ్యవహరించారు. దీంతో ఈ సినిమా బడ్జెట్‌, బిజినెస్‌, కలెక్షన్లపై అధికారులు ఆరా తీస్తున్నారు. దాంతో పాటు దీంతో గతంలో చెల్లించిన పన్ను, కలెక్షన్లను కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

తాజాగా ఈ ఐటీ దాడులపై నిర్మాత దిల్ రాజు స్పందిస్తూ..ఐటీ దాడులు జరగడం అన్నది కామన్. పెద్ద సినిమాల రిలీజ్ సమయంలో ఇలాంటి సోదాలు జరుగుతూనే ఉంటాయి. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని స్పష్టం చేశారు. మహేశ్ బాబు, పూజాహెగ్డే జంటగా, ప్రకాశ్ రాజ్, ప్రధాన పాత్రలో అల్లరి నరేశ్ నటించిన ఈ సినిమాను వంశీ పైడిపల్లి రూపొందించగా, దిల్ రాజు, పీవీపీ, అశ్వనీదత్ నిర్మించారు.

Leave a comment