ఐపిఎల్ 2018.. కొందరికి షాక్.. మరికొందరికి బ్రేక్..!

ఐపిఎల్ 2018 సీజన్ కు రంగం సిద్ధమవుతుంది. ప్రస్తుతం 10 సంవత్సరాల అగ్రిమెంట్ కంప్లీట్ కావడంతో జట్టు సభ్యులను కొత్తగా తీసుకోవాల్సి ఉండగా జరిగిన తీర్మానాల ప్రకారం ఆల్రెడీ జట్టులో ఉన్న ఒకరిద్దరి సభ్యులను రిటైన్ చేసుకోవచ్చని అనుమతి ఇచ్చారు. ఇక ఈ రిటెన్షన్ ప్రక్రియలో కొన్ని అద్భుతాలు జరిగాయి. కొన్నాళ్లుగా కలకత్తా నుండి గంభీర్ నిష్క్రమిస్తాడన్న వార్తలను నిజం చేస్తూ కలకత్తా గంభీర్ ను వదిలేశారు.

ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నుండి కెప్టెన్ డేవిడ్ వార్నర్, భువనేశ్వర్ కుమార్ లను తీసుకోగా.. శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్ లకు బ్రేక్ వేశారు. అయితే రైటు టూ మ్యాచ్ ద్వారా మళ్లీ ఆయా జట్ల ఆటగాళ్లను మళ్లీ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం రిటెన్షన్ ప్రక్రియ ద్వారా పెద్ద మార్పులేమి చోటు చేసుకోలేదు. కలకత్తా సునీల్ నరైన్, ఆడ్రూ రస్సెల్ కు అవకాశం ఇచ్చారు.

ఇక రెండేళ్లుగా నిషేధంలో ఉన్న చెన్నై, రాజస్థాన్ జట్లు ఈ ఐపిఎల్ లో ఆడనున్నారు. చెన్నై టీంలో ధోని, సురేష్ రైనా రవింద్ర జడేజా కొనసాగిస్తుండగా.. ఆర్సిబిలో విరాట్ కొహ్లి, డివిలియర్స్, సర్పరాజ్ ఖాన్ కొనసాగుతున్నారు. ముంబై ఇండియన్స్ లో కూడా రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్య, బుమ్రా రిటెన్షన్ అవుతున్నారు. ఢిల్లి జట్టులో రిషబ్ పంత్, శ్రీయాస్ అయ్యర్, క్రిస్ మొరిస్ రిటైండ్ చేయబడ్డారు. కింగ్స్ ఎలవన్ పంజాబ్ లో అక్షర్ పటేల్ రిటైనెడ్ అయ్యాడు.

మొత్తానికి నిన్న లైవ్ లో జరిగిన ఈ రిటెన్షన్ ప్రక్రియలో ఐపిఎల్ జట్లన్ని ముందు జాగ్రత్తగా బలమైన జట్టు సభ్యులకే తమ ఓటు వేశాయి. ఇక అసలు సిసలైన కొనుగోలు ప్రక్రియ త్వరలో జరుగనుంది. త్వరలో మొదలవనున్న ఐపిఎల్ 11వ సీజన్ లో ఏ జట్టు విజయం సాధిస్తుందో చూడాలి.

Leave a comment