Movies" ఇంటిలిజెంట్ " రివ్యూ & రేటింగ్

” ఇంటిలిజెంట్ ” రివ్యూ & రేటింగ్

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్, వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇంటిలిజెంట్. సి. కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించగా తమన్ మ్యూజిక్ అందించారు. ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకుందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

గొప్ప ఆశయాలతో తను కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు కూడా షేర్ ఇస్తూ సమాజానికి సేవ చేస్తూ ఉంటాడు నందకిశోర్ (నాజర్). ఇక తన చేతుల మీదుగా చిన్నప్పుడే గోల్డ్ మెడల్ తీసుకున్న తేజా (సాయి ధరం తేజ్) అతన్ని సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా చేసి తన దగ్గరే ఉంచుకుంటాడు. ఇక అతని మీద అతని కంపెనీ మీద విలన్లు కన్నేస్తారు. వారి నుండి కంపెనీని కాపాడుకునే క్రమంలో నందకిశోర్ ప్రాణాలు కోల్పొతాడు. ఇక నందకిశోర్ చనిపోడానికి గల కారణాలు తెలుసుకున్న తేజ్ ధర్మా భాయ్ గా మారి శత్రువుల పని ఎలా పట్టాడు అన్నదే అసలు కథ.

నటీనటుల ప్రతిభ :

సాయి ధరం తేజ్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. అయితే సినిమా కంటెంట్ లో విషయం లేకపోవడంతో హీరోకి అంత వెయిట్ ఉన్నట్టు అనిపించదు. ఇక లావణ్య త్రిపాఠి పాత్ర కేవలం సాంగ్స్ కే అన్నట్టు ఉంటుంది. విలన్ రాహు దేవ్ పర్వాలేదు అనిపించగా.. సప్తగిరి, వేణు, రాహుల్ రామకృష్ణ కామెడీ ఏదో మమా అనిపించారు. పోలీస్ పాత్రల్లో షయాజి షిండే, ఆశిష్ విద్యార్ధి ఎప్పటిలానే చేశారు. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించారు.

సాంకేతికవర్గం పనితీరు :

విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఆకుల శివ కథ పాత చింతకాయ పచ్చడిలా అనిపిస్తుంది. వినాయక్ డైరక్షన్ కూడా ఆకట్టుకోలేదు. కథనం కూడా రొటీన్ గా నడిపించాడు. మ్యూజిక్ తమన్ కూడా ఇంప్రెస్ చేయలేదు. ఎడిటింగ్ ఇంకా జాగ్రత్తపడాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

విశ్లేషణ :

కొత్త ప్రయోగాలతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తున్న ఈ తరుణంలో ఓ రొటీన్ కథ.. అంతకంటే రొటీన్ స్క్రీన్ ప్లేతో వచ్చాడు ఈ ఇంటిలిజెంట్. ఆకుల శివ కథ, వినాయక్ స్క్రీన్ ప్లే, డైరక్షన్ రెండు విఫలమయ్యాయి. కథనంలో ఏమాత్రం కొత్తదనం చూపించలేదు. తిక్క, విన్నర్, జవాన్ ల తర్వాత ఓ వెరైటీ సబ్జెక్ట్ తో వస్తాడనుకున్న తేజ్ మళ్లీ నిరాశ పరచాడు.

ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అని తేడా లేదు సినిమా మొదటి షాట్ నుండి రొటీన్ పంథాలోనే సాగుతుంది. ఇక హీరో ఎలివేషన్ సీన్స్ కావాలని రాసుకున్నట్టుగా ఉండగా.. కేవలం పాటల కోసమే హీరోయిన్ పాత్ర అన్నట్టు ఉంటుంది. కథ కథనల్లో దర్శకుడు ఎక్కడ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయలేకపొయాడు. ట్రైలర్ చూసిన తర్వాత వచ్చిన రొటీన్ ఫీలింగే సినిమా చూశాక వస్తుంది. ఇక రొటీన్ పంథాలో నడిపించిన ఈ సినిమా కథ ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

డ్యాన్సులు

సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

మ్యూజిక్

స్టోరీ, స్క్రీన్ ప్లే

బాటం లైన్ :

ఇది రొటీన్ ‘ఇంటిలిజెంట్’ కథ..!

రేటింగ్ : 2/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news