Newsరాజమౌళి కోసం ఎన్టీఆర్ వాళ్లకి దెబ్బయ్యబోతున్నాడా..?

రాజమౌళి కోసం ఎన్టీఆర్ వాళ్లకి దెబ్బయ్యబోతున్నాడా..?

ఎన్టీఆర్ ఇప్పుడు సినీ తెర మీదే కాదు బుల్లి తెర మీద కూడా మంచి క్రేజ్ సంపాదించేసాడు. మొన్నామధ్య వచ్చిన బిగ్ బాస్ షో ద్వారా ఎన్టీఆర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ తరువాత హీరో నాని రెండో సీజన్ కి హోస్ట్ గా వ్యవహరించారు. కానీ మొదట ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించినప్పుడు వచ్చిన క్రేజ్ రెండో సీజన్ లో రాలేదు. ఇక ఇప్పుడు సీజన్ 3 స్టార్ట్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది.

ఇందులో ఎన్టీఆర్ హోస్ట్ గా ఉండేందు ఒప్పుకోకపోయినా… ఫస్ట్ రౌండ్ డిస్కషన్లలో చేసేందుకు మాత్రం ఎన్టీఆర్ ప్రాధమికంగా ఓకే అన్నట్లుగా వార్తలు కూడా వచ్చాయి.ఇంతవరకు బాగానే ఉన్నా…ఈ ఫస్ట్ రౌండ్ డిస్కర్షన్ లో పాల్గొనేందుకు ఎన్టీఆర్ కి పెద్ద చిక్కొచ్చి పడిందట.అదేంటి అంటే… ప్రస్తుతం ఎన్టీఆర్ – చెర్రీల కాంబినేషన్ లో దర్శక బాహుబలి రాజమౌళి ఆర్ఆర్ఆర్ నిర్మాణం జరుపుకోనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా కారణంగా బిగ్ బాస్ షో కి ఎన్టీఆర్ వెళ్లడం అనుమానంగానే ఉన్నట్టు తెలుస్తోంది.

ఆర్ ఆర్ ఆర్ కి దాదాపు 200 వర్కింగ్ డేస్ కాల్ షీట్లు ఇచ్చాడట ఎన్టీఆర్ అయితే ఇప్పటికి గట్టిగా పాతిక కూడా కాలేదు. ఇంకా 175 కాల్ షీట్లు కావాలి. ప్రస్తుతం షూటింగ్ గ్యాప్ ఇచ్చారు. ఇండియా వైజ్ గా ఎంపిక చేసి, స్టార్ కాస్ట్ ను సెట్ చేసేపనిలో రాజమౌళి బిజీగా వున్నారు. ఈ వర్క్ పూర్తయితే వెంటనే షూట్ కు వెళ్లిపోవాల్సి వుంటుంది. అక్కడ నుంచి డేట్ లు అన్నవి, ఎన్టీఆర్ చేతిలో వుండవు. కాంబినేషన్ల మీద ఆధారపడి వుంటుంది.అందుకే బిగ్ బాస్ షో చేయడం కన్నా, వదిలేయడానికే ఎన్టీఆర్ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే బిగ్ బాస్ షో నిర్వాహకులు మాత్రం ఎన్టీఆర్ ను ఏదో ఒక రకంగా ఒప్పించి తీసుకురావాలని చూస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news