GossipsRRR టైటిల్ పై రాజమౌళి షాకింగ్ న్యూస్..!

RRR టైటిల్ పై రాజమౌళి షాకింగ్ న్యూస్..!

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా ఎలా ఉండాలని అభిమానులు ఆశించారో ఆ అంచనాలకు తగినట్టుగా మెగా నందమూరి హీరోలతో మెగా మల్టీస్టారర్ షురూ చేశాడు రాజమౌళి. బాహుబలి మొదటి రెండు పార్టులతో తెలుగు సినిమా స్టామినాను ప్రపంచదేశాలకు తెలిసేలా చేసిన జక్కన్న ఆర్.ఆర్.ఆర్ ప్రాజెక్ట్ ను అదే రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది. డివివి దానయ్య నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా ఈమధ్యనే ముహుర్త కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
2
సినిమా ఓ పిరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ మూవీ దొంగా పోలీస్ కథతో వస్తుందని అంటున్నారు. సినిమాలో ఎన్.టి.ఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తున్నాడని తెలుస్తుండగా చరణ్ పోలీస్ గా నటిస్తాడట. ఇక ఈ మూవీకి టైటిల్ గా రామ రావణ రాజ్యం అని ఫిక్స్ చేశారట. రాముడిగా చరణ్ రావణుడిగా ఎన్.టి.ఆర్ కనిపిస్తారన్నమాట.
1
జై లవ కుశ చూశాక రాజమౌళికి ఈ కథ ఆలోచన వచ్చిందో ఏమో కాని మొత్తానికి ఆర్.ఆర్.ఆర్ సరికొత్త సంచలనాలతో సరికొత్త రికార్డులను సృష్టించబోతుందన్న విషయం మాత్రం చెప్పొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news