టాప్‌లెస్ ఫోజుతో ఘాటైన సందేశం..!

877

గోవా బ్యూటీ ఇలియానా సౌత్ సినిమాలను వదిలి బాలీవుడ్ బాట పట్టగా అక్కడ అనుకున్న రేంజ్ సంపాదించలేకపోయింది. ఆస్ట్రేలియా ఫోటో గ్రాఫర్ ఆండ్రూతో డేటింగ్ లో ఉన్న అమ్మడు అప్పుడప్పుడు తన హాట్ పిక్స్ తో సంచలనంగా మారుతుంది. ఇక చాన్నాళ్ల తర్వాత ఓ తెలుగు సినిమా అవకాశం అందుకుంది ఇలియానా. శ్రీను వైట్ల డైరక్షన్ లో రవితేజ హీరోగా వస్తున్న అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఇల్లి బేబి.

ఇక ఈ సినిమాలో నటిస్తూ షాకింగ్ కామెంట్స్ తో అందరిని సర్ ప్రైజ్ చేస్తుంది. తన ఇన్ స్టాగ్రాంలో సెమి న్యూడ్ అదేనండి టాప్ లెస్ స్టిల్ ఇచ్చిన ఇలియానా.. నువ్వు ఎవరి వల్ల ఈ పొజిషన్ కు రాలేదు.. జీవితంలో చీకటి వెలుగులకు కారణం నువ్వే.. అలా కాకుండా ఎవరైనా తామే అని చెబితే.. ఫక్ దెయిర్ ఒపీనియన్స్ అంటూ హాట్ కామెంట్ పెట్టింది ఇలియానా.

ఘాటైన పదజాలంతో అమ్మడు ఎవరికి వార్నింగ్ ఇచ్చిందో తెలియదు కాని ఇలియానా మాత్రం ఫైర్ మీద ఉందన్నది మాత్రం అర్ధమవుతుంది. ప్రస్తుతం అమ్మడు చేస్తున్న రవితేజ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకుంది.

Leave a comment