Movies' ఇస్మార్ట్ శంక‌ర్ ' వ‌ర‌ల్డ్‌వైడ్ క్లోజింగ్ క‌లెక్ష‌న్స్‌

‘ ఇస్మార్ట్ శంక‌ర్ ‘ వ‌ర‌ల్డ్‌వైడ్ క్లోజింగ్ క‌లెక్ష‌న్స్‌

యంగ్ ఎన‌ర్జిటిక్ హీరో రామ్ – డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో వ‌చ్చిన ఇస్మార్ట్ శంక‌ర్ సినిమా బాక్సాఫీస్ ర‌న్ దాదాపు క్లోజ్ అయ్యింది. ఈ సినిమాతో ఆరు వ‌రుస ప్లాపుల త‌ర్వాత పూరికి… మూడేళ్ల త‌ర్వాత రామ్‌కు మంచి హిట్ వ‌చ్చిన‌ట్ల‌య్యింది. మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో రామ్ స‌ర‌స‌న నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా న‌టించారు.

జూలైలో రిలీజ్ అయిన ఈ సినిమాకు మాస్ ప్రేక్ష‌కుల‌తో పాటు బీ, సీ సెంట‌ర్ల ప్రేక్ష‌కుల నుంచి మాంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇస్మార్ట్ శంకర్ ప్రపంచవ్యాప్తంగా రూ .34.55 కోట్ల థియేట్రిక‌ల్ షేర్ సాధించింది. ఇస్మార్ట్ శంకర్ యొక్క థియేట్రికల్ హక్కులు రూ .17 కోట్లకు అమ్ముడయ్యాయి. రామ్ నటన, పూరి దర్శకత్వ సామర్థ్యాలు, మణిశ‌ర్మ‌ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు ప్రేక్షకుల నుంచి టాప్ క్లాస్ స్పందన వచ్చింది.

ఈ సినిమా కొన్న వారికి రూపాయికి రెండు రూపాయ‌ల భారీ లాభం వ‌చ్చింది. ఈ సినిమా ఏరియా వైజ్ షేర్ డీటైల్స్ ఇలా ఉన్నాయి.

ఇస్మార్ట్ శంక‌ర్ క్లోజింగ్ షేర్ (రూ.కోట్ల‌లో) :

నైజాం – 13.60 కోట్లు

సీడెడ్ – 5.45 కోట్లు

వైజాగ్ – 3.80 కోట్లు

ఈస్ట్‌- 2.05 కోట్లు

వెస్ట్ – 1.75 కోట్లు

కృష్ణా – 2.0 కోట్లు

గుంటూరు – 1.95 కోట్లు

నెల్లూరు – 1.05 కోట్లు
————————————
ఏపీ, తెలంగాణ = 31.65 కోట్లు
————————————

రెస్టాఫ్ ఇండియా – 1.90 కోట్లు

రెస్టాఫ్ వ‌ర‌ల్డ్ – 1.0 కోట్లు
————————————————
టోట‌ల్ వ‌ర‌ల్డ్ వైడ్ షేర్ – 34.55 కోట్లు
————————————————

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news