Gossipsహైదరాబాదీ తెలివికి జనం ఫిదా..!

హైదరాబాదీ తెలివికి జనం ఫిదా..!

నేటి సమాజంలో ఆకలి వేస్తే ఏదైనా హోటల్‌కు వెళ్లి తినేవారి సంఖ్య చాలా తగ్గింది. దీనికి కారణం ఆన్‌లైన్‌లో ఇంటివద్దకే ఆహారాన్ని తీసుకొచ్చే డెలివరీ చేసే యాప్‌లు కుప్పలుతెప్పలుగా ఉండటం. దీనిలో ఎక్కువగా ప్రాముఖ్యత పొందిన ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో. ఇక ఇటీవల జొమాటో యాప్ ఏదో ఒక విషయంలో నిత్యం వార్తల్లో నిలిచింది. కాగా తాజాగా మన హైదరాబాదీ దెబ్బకు జొమాటో మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

ఇటీవల హైదారాబాద్‌కు చెందిన ఒబేష్ కొమిరిశెట్టి ఇనార్బిట్ మాల్‌లో షాపింగ్ చేసేందుకు వెళ్లాడు. అప్పటికే సమయం రాత్రి 11.50 కావడంతో బయటకొచ్చి ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేద్దాం అని చూశాడు. క్యాబ్ రేటు ఏకంగా రూ.300కు పైగా ఉండటంతో అతడికి ఓ అదిరిపోయే ఐడియా వచ్చింది. అతడు ఉన్న చోట ఓ దోస బండి ఉంది. వెంటనే మనోడు జొమాటో యాప్ ఓపెన్ చేసి సదరు దోస బండి నుండి ఓ దోసను ఆర్డర్ చేశాడు. కాసేపటికి ఓ జొమాటో డెలివరీ బాయ్ అక్కడికి వచ్చి దోస తీసుకుంటున్నాడు. వెంటనే ఒబేష్ అతడి వద్దకు వెళ్లి తానే దోస ఆర్డర్ చేశానని.. అది తనకు ఇచ్చి అతడిని ఇంటి దగ్గర డ్రాప్ చేయాల్సిందిగా కోరాడు.

ఆ డెలివరీ బాయ్ కూడా అందుకు ఒప్పుకుని ఒబేష్‌ను ఇంటి వద్ద దింపేందుకు వెళ్లాడు. తనకు 5 స్టార్ రేటింగ్ ఇవ్వాల్సిందిగా మాత్రమే సదరు జొమాటో డెలివరి బాయ్ కోరినట్లు ఒబేష్ తెలిపాడు. ఇదే విషయాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు ఒబేష్. తనను ఇంటి వద్ద ఫ్రీగా దింపినందుకు జొమాటోకు ఓ థ్యాంక్స్ వేసుకున్నాడు మనోడు. ఇది చూసిన నెటిజన్లు.. ఏం తెలివిరా నాయనా..! అంటూ మనోడిని పొగడ్తలతో ముంచెత్తారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news