Reviews"హైదరబాద్ లవ్ స్టోరీ" తెలుగు సినిమా రివ్యూ

“హైదరబాద్ లవ్ స్టోరీ” తెలుగు సినిమా రివ్యూ

అందాల రాక్షసి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాహుల్ రవింద్రన్ ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇక హైదరాబాద్ లవ్ స్టోరీ అంటూ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చాడు రాహుల్. రాజ్ సత్య డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

కార్తిక్ (రాహుల్ రవింద్రన్) ఎల్ అండ్ టి కంపెనీలో జాబ్ చేస్తుంటాడు. తొలిచూపులోనే భాగ్యలక్ష్మి (రేష్మి మీనన్) ను చూసి ఇష్టపడతాడు కార్తిక్. ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడగా.. కార్తిక్ అమ్మాయిల కన్నా అబ్బాయిల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడంతో భాగ్యలక్ష్మికి డౌట్ కలుగుతుంది. విషయం పెద్దది చేసి నానా హంగామా చేస్తుంది. భాగ్యలక్ష్మి కార్తిక్ ను బాగా అవమాన పరుస్తుంది. ఈమధ్యలో మరో పాత్ర జియా ఎంటర్ అవుతుంది. ఇక్కడ కథ కొత్త టర్న్ తీసుకుంటుంది. ఇంతకీ కార్తిక్ ఎందుకు అలా ప్రవర్తించాడు..? భాగ్యలక్ష్మికి అనుమానం ఎందుకు వచ్చింది..? సినిమా కథ ఎలా సాగింది అనేది తెర మీద చూడాల్సింది.

నటీనటుల ప్రతిభ :

కార్తిక్ ఎప్పటిలానే లవర్ బోయ్ గా అలరించాడు. తన మార్క్ నటనతో ఆకట్టుకునేలా ఇంప్రెస్ చేశాడు. ఇక రేష్మి మీనన్ పాత్ర హోంలీగా అలరించింది. జియా గ్లామర్ షోతో అదరగొట్టింది. కార్తిక్, జియా సీన్స్, సాంగ్స్ యూత్ ఆడియెన్స్ కు నచ్చేలా ఉంటాయి. కామెడీ కూడా బాగానే వర్క్ అవుట్ అయ్యాయి. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతికవర్గం పనితీరు :

రాజ్ సత్య కథ, కథనాలు ఇంప్రెసివ్ గా ఉన్నాయి. అయితే కథనం తెరకెక్కించిన తీరు బాగుంది. సునీల్ కశ్యప్ మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా ఉంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ కూడా పర్వాలేదు. నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి. డైలాగ్స్ కూడా ఆకట్టుకున్నాయి.

విశ్లేషణ :

స్నేహం, ప్రేమ ఇలా రెండిటికి తేడా చెబుతూ వచ్చిన కథలు… సినిమాలు చాలానే వచ్చాయి. ఈ హైదరాబాద్ లవ్ స్టోరీ కూడా ఆ కోవలో వచ్చిన సినిమానే. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నా దానిని తెరకెక్కించడంలో తడపడ్డాడు. మొదటి భాగం కాస్త ఇంట్రెస్టింగ్ గా సాగినా సెకండ్ హాఫ్ బోర్ కొడుతుంది. సినిమా బలంగా ఉండాల్సిన సమయంలోనే పేవలమైన సీన్స్ రాసుకున్నాడు.

సినిమా కథ కొత్తగా అనిపించదు కాని ఎంచుకున్న కథలోని ఇంటర్నల్ పాయింట్ బాగున్నట్టు అనిపిస్తుంది. ఇంకాస్త వర్క్ అవుట్ చేసి ఉంటే సినిమా తప్పకుండా బాగా తీయగలడనేలా ఉంటుంది. దాదాపు ఓ పావుగంట సినిమా ట్రిం చేసినా తప్పులేదనిపిస్తుంది.

కథనానికి సపోర్ట్ ఇచ్చే సీన్స్ ఇంట్రెస్టింగ్ గా రాసుకోవడంలో విఫలమయ్యాడు. మొత్తానికి సినిమా అంతా అటుఇటుగా నడిపించాడు. యూత్ ఎంటర్టైనర్ గా వచ్చిన హైదరాబాద్ లవ్ స్టోరీ ఆ రేంజ్ లో అలరించలేదని చెప్పొచ్చు.

ప్లస్ పాయింట్స్ :

రాహుల్ రవింద్రన్, రేష్మి మీనన్

సినిమాటోగ్రఫీ

మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

స్టోరీ, స్క్రీన్ ప్లే

డైరక్షన్

వరస్ట్ కామెడీ

బాటం లైన్ :

ఏమాత్రం ఆకట్టుకోలేని.. హైదరాబాద్ లవ్ స్టోరీ..!

రేటింగ్ : 2/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news