Movies" హుషారు " రివ్యూ & రేటింగ్

” హుషారు ” రివ్యూ & రేటింగ్

యువతను ఆకట్టుకునే ప్రయత్నం ఎలాంటిదైనా సరే ప్రేక్షకులు మెప్పించేలా చేస్తున్నాయి. యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ కు బడ్జెట్ కూడా పెద్దగా ఉండదు. అలాంటి దారిలోనే నలుగురు కుర్రాళ్ల కథతో వచ్చిన సినిమానే హుషారు. శ్రీ హర్ష డైరెక్ట్ చేసిన ఈ సినిమా బెక్కం వేణుగోపాల నిర్మించారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

చిన్ననాటి స్నేహితులుగా ఉన్న నలుగురు కుర్రాళ్లు వారి లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అందరు అమ్మాయిలను ఇంప్రెస్ చేయడమే పెద్ద పనిగా పెట్టుకుంటారు. ఇదిలాఉంటే ఆర్య గీతాను, చై రియాను ప్రేమిస్తారు. డబ్బు కోసం ఈ నలుగురు ఇంట్లోనే బీర్ తయారు చేయడం మొదలు పెడతారు. అలా వారి బిజినెస్ రెస్టారెంట్ వరకు వెళ్తుంది. అసలు వారు డబ్బులు ఎందుకు కావాలనుకున్నారు..? వారికి ఎదురైన అడ్డంకులు ఏంటి..? వాటిని ఎలా అధిగమించారు అన్నది సినిమా కథ.

నటీనటుల ప్రతిభ :

హీరోలు నలుగురు కొత్తవాల్లే.. వారికి తగిన పాత్రల్లో మెప్పించారు. అయితే సినిమాలో రాహుల్ రామకృష్ణ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాడు. హీరోయిన్స్ రమ్య, హేమల్ ఆకట్టుకున్నారు. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతికవర్గం పనితీరు :

సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. సింపుల్ లొకేషన్స్ లోనే అందంగా తీశారు. రాదన్ మ్యూజిక్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. కథ, కథనాలు దర్శకుడు శ్రీ హర్ష పర్వాలేదు అనిపించాడు. కథ రొటీన్ గా అనిపిస్తుంది. కథనం మెప్పించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి.

విశ్లేషణ :

యూత్ ఫుల్ స్టోరీలకు ఈమధ్య మంచి గిరాకి ఏర్పడింది. గమ్యం లేని యువతకు తమ ఆలోచనలకు తగినట్టుగా వారి గోల్ ఫిక్స్ చేసుకోవాలని చాలా సినిమాలు చెప్పాయి. అలాంటి వాటిలోనే హుషారు సినిమా కూడా ఒకటి. నలుగురు కుర్రాళ్లు.. లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఏదో చేయాలని అనుకుంటారు. ఫైనల్ గా సొంతంగా బీర్ బిజినెస్ మొదలు పెడతారు.

కథ అంతా రొటీన్ యూత్ స్టోరీగా అనిపించినా దర్శకుడు శ్రీహర్ష అక్కడక్కడ తన హ్యూమర్ తో ఇంప్రెస్ చేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా రొటీన్ కామెడీతో వెళ్తుంది. ఇక సెకండ్ హాఫ్ రాహుల్ రామకృష్ణ మీద వేసుకున్నాడు. పిచాక్ సాంగ్ తో పాటుగా సాఫ్ట్ వేర్ ఎంప్లాయి ఫ్రస్ట్రేషన్ బాగా చూపించారు.

సినిమా సెకండ్ హాఫ్ ఎమోషనల్ తో పాటుగా మంచి ట్రాక్ లో నడుస్తుంది. క్లైమాక్స్ కూడా మనసుకి నచ్చేలా ఉంటుంది. మొత్తానికి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన హుషారు యువతను మెప్పిస్తుందని చెప్పొచ్చు.

ప్లస్ పాయింట్స్ : రాహుల్ రామకృష్ణ

హ్యూమర్

క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ : రొటీన్ యూత్ స్టోరీ

కమర్షియల్ యాస్పెక్ట్స్

బాటం లైన్ : హుషారు.. యూత్ ఫుల్ ఎంటర్టైనర్..!

రేటింగ్ : 2.5/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news