బిగ్ బాస్ సెట్ లో భారీ అగ్ని ప్రమాదం..!

bigboss

రియాలిటీ షోలో రారాజుగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ బాలీవుడ్ నుండి అన్ని రీజనల్ లాంగ్వేజెస్ కు విస్తరించబడింది. స్టార్ మా ప్రెస్టిజియస్ గా రూపొందిస్తున్న బిగ్ బాస్ తెలుగులో కేవలం మొదటి సీజన్ మాత్రమే పూర్తి చేసుకుంది కాని మిగతా భాషల్లో మాత్రం నాలుగు, ఐదు సీజన్లు పూర్తయ్యాయి. అయితే అనుకోకుండా బిగ్ బాస్ సెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగిందట.

షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. కన్నడలో సుదీప్ వ్యాఖ్యాతగా చేస్తున్న బిగ్ బాస్ 5వ సీజన్ జరుగాల్సి ఉంది. ఈ సీజన్ కోసం ఏర్పరుస్తున్న సెట్ లో మంటలు చెలరేగాయట. దాదాపు చాలా పెద్ద మొత్తంలోనే ఆస్థి నష్టం జరిగిందని తెలుస్తుంది. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఈ సెట్ ఏర్పరిచారు.

ఇక తెలుగు బిగ్ బాస్ సీజన్ వన్ కు పూణెలో సెట్ వేయగా.. ఈసారి సెకండ్ సీజన్ కు హైదరాబాద్ లోనే సెట్ ఎరేంజ్ చేస్తారని తెలుస్తుంది. మొత్తానికి బిగ్ బాస్ సెట్ లో మంటలు రావడం కంటెస్టంట్స్ కు షాక్ ఇచ్చినట్టు అయ్యింది.

Leave a comment