మహానటి శాటిలైట్ కళ్లుచెదిరే డిమాండ్..!

rangasthalam-satellite-righ

సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి సినిమా వారం లోనే పెట్టిన బడ్జెట్ తిరుగొచ్చేలా చేసింది. ప్రస్తుతం ఆ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్ అంతా ప్రాఫిట్స్ పొందుతున్నారు. కీర్తి సురేష్ మహానటిగా నటించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్ రిలీజ్ కు ముందు 5 కోట్ల దాకా ఆఫర్స్ వచ్చాయట.

అయితే సినిమాపై భారీ అంచనాలున్న దర్శక నిర్మాతలు రిలీజ్ తర్వాత అమ్ముదామని అనుకోగా రిలీజ్ అయిన మొదటి రెండు రోజుల్లో 11 కోట్ల దాకా శాటిలైట్ రైట్స్ డిమాండ్ ఏర్పడిందట. ఇక ఇప్పుడు ఈ సినిమాకు 22 కోట్ల దాకా శాటిలైట్ హక్కులను అడుగుతున్నారట. 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన మహానటి సినిమా అది కేవలం శాటిలైట్ రైట్స్ రూపంలో పొందటం విశేషం..

వైజయంతి బ్యానర్ ప్రెస్టిజియస్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆ బ్యానర్ కు మంచి కం బ్యాక్ సినిమా అయ్యింది. ఇక నుండి నిర్మాత అశ్వనిదత్ వరుస సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మహేష్ తో దిల్ రాజుతో కలిసి సినిమా నిర్మిస్తున్న అశ్వనిదత్, ఎన్.టి.ఆర్ హీరోగా మరో సినిమా నిర్మిస్తున్నారని తెలుస్తుంది.

Leave a comment