Moviesఅక్కడ అనుష్క సినిమాకు భారీ డిమాండ్..!

అక్కడ అనుష్క సినిమాకు భారీ డిమాండ్..!

స్వీటీ అనుష్క లీడ్ రోల్ లో కిశోర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా భాగమతి. యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను క్రియేట్ చేసింది. జనవరి 26, 2018న రిలీజ్ ప్లాన్ చేసుకున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లో సత్తా చాటుతుంది. తెలుగులోనే కాదు తమిళంలో కూడా అనుష్క భాగమతికి భారీ డిమాండ్ ఏర్పడిందట.
తెలుస్తున్న సమాచారం ప్రకారం అనుష్క భాగమతి కోలీవుడ్ లో థియేట్రికల్ ప్లస్ శాటిలైట్ కలిపి దాదాపు 10 కోట్ల దాకా అమ్ముడయ్యిందట. ఫీమేల్ లీడ్ మూవీ అది కూడా ఫాంలో లేని అనుష్క సినిమాకు ఈ రేంజ్ డిమాండ్ అంటే మాములు విషయం కాదు. సినిమాలో అనుష్క పాత్ర కచ్చితంగా ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు.
యువి బ్యానర్ లో సినిమా అంటే కచ్చితంగా ఆ సినిమా రేంజ్ వేరేలా ఉంటుంది. తక్కువ టైంలో బ్యానర్ లో సినిమాల మీద అంచనాలు ఏర్పడేలా చేసుకున్నారు. మరి ప్రయోగాత్మకంగా రాబోతున్న ఈ భాగమతి ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి.
మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news