వెంకీ-పూరీ సినిమా.. మార్కెట్‌కి మించి భారీ బడ్జెట్.. ఎంతో తెలిస్తే షాకే!

huge budget for venkatesh puri jagannadh film

Tollywood ace producer Suresh Babu is going to spend huge budget on Venkatesh – Puri Jagannadh’s film.

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా ఓ మూవీ కన్ఫమ్ అయిన విషయం అందరికీ తెలుసు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఈ మూవీ కోసం భారీ బడ్జెట్ కేటాయించాలని పూరీ డిమాండ్ చేసిన నేపథ్యంలో.. అతను చెప్పిన మొత్తం సమకూర్చేందుకు నిర్మాత సురేష్‌బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఇంతకీ ఎంత అమౌంట్ తెలుసా? అక్షరాల రూ.45 కోట్లు.

నిజానికి.. వెంకీ మార్కెట్ రూ.30 కోట్లలోపే ఉంది. సోలో హీరోగా ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘బాబు బంగారం’ సినిమానే రూ.30 కోట్లు అతికష్టం మీద రాబట్టింది. అలాంటిది.. పూరీతో చేయనున్న ప్రాజెక్ట్ కోసం 45 కోట్లు బడ్జెట్ కేటాయిస్తుండడం కాస్త రిస్క్‌తో కూడుకున్న పనే. ఈ స్ర్కిప్ట్, దాన్ని పూరీ నెరేట్ చేసిన విధానం చాలా బాగుండడంతో.. ఈ చిత్రం ఖచ్చితంగా భారీ విజయం సాధిస్తుందన్న నమ్మకంతో అంత మొత్తం ఖర్చు చేసేందుకు సురేష్ పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. మరో విశేషం ఏమిటంటే.. ఈ సినిమాతో వెంకీ నిర్మాతగా మారబోతున్నాడని, సురేష్‌బాబుతో కలిసి దీన్ని నిర్మించనున్నాడని అంటున్నారు.

ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టి, ఏప్రిల్ లేదా మే నుంచి షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు.

Leave a comment