మహర్షిలో అదే హైలైట్.. థియేటర్ టాప్ లేవాల్సిందే!

52

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న మహర్షి చిత్రం ఎట్టకేలకు మే 9న ప్రపంచవ్యాప్త రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో బాక్సాఫీస్ భరతం పట్టేందుకు రెడీ అయ్యాడు మహేష్. ఇక ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్‌ క్రియేట్ చేస్తుందా అని టాలీవుడ్ జనాలు లెక్కలు వేస్తుంటే.. సినిమాలో ఇంప్రెస్ చేసే మ్యాటర్ ఏముందా అని మరికొంత మంది ఆలోచిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఆడియెన్స్‌ను ఆకట్టుకునే ఎపిసోడ్స్ చాలా ఉన్నా అందులో ఒక ఎపిసోడ్ మహేష్‌ను ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ చేస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మహర్షి సినిమాలో మహేష్ మూడు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తాడట. ఇక ఫస్టాఫ్‌లో మహేష్ కాలేజీ స్టూడెంట్‌లా కనిపిస్తాడు. ఈ సమయంలో కాలేజీకి వచ్చే అల్లరి నరేష్‌తో మహేష్ చేసే కామెడీ సూపర్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ కాలేజీ ఎపిసోడ్‌లో హీరోయిన్ పూజా హెగ్డేతో కలిసి అల్లరి నరేష్, మహేష్ చేసే కామెడీ ఫస్టాఫ్‌కు హైలైట్ అని తెలుస్తోంది. ఇక మహేష్ సూపర్ కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించాడట. మొత్తానికి ఫస్టాఫ్ కామెడీ ఎపిసోడ్స్‌తో మహర్షి ప్రేక్షకులను థియేటర్ టాప్ లేచే విధంగా నవ్వించడం ఖాయం అని తెలుస్తోంది.

ఇక సెకండాఫ్ మొత్తం సీరియస్ నోట్‌పై నడుస్తుందట. మంచి ఎమోషన్ ఉన్న కంటెంట్‌తో మహేష్ పవర్ ఫ్యాక్ పర్ఫార్మెన్స్‌తో ఆడియెన్స్ ఓ ఇంప్రెసివ్‌ మూవీని ప్రేక్షకులకు అందించనున్నాడు. ఇక సినిమా థియేటర్లలో ఆడియెన్స్ సినిమాను రిసీవ్ చేసుకునే తీర ఎలా ఉంటుందో ఎల్లుండి మనం స్వయంగా చూస్తాం. గెట్ రెడీ ఫర్ ది జర్నీ ఆఫ్ రిషి అంటున్నాడు మహేష్ ఫ్యాన్స్.

Leave a comment