ఈవెంట్ కు అటెండ్ కాలేదని.. హీరోయిన్ ను దారుణంగా చంపేశారు..!

heroine-murder

పాకిస్తాన్ లో యాక్ట్రెస్ కం సింగర్ సుంబుల్ ఖాన్ ను అతి కిరాతకంగా హత్య చేశారు. పాకిస్తాన్ లో పాస్తో అనే భాషలో సీరియల్స్ లో నటిస్తూ సినిమాలో గాయనిగా జీవనం కొనసాగిస్తున్న ఆమెకు ఓ ఈవెంట్ లో పాటిస్పేట్ చేయాల్సిందిగా ఆఫర్ చేశారట. అయితే ఆమె దానికి నిరాకరించిందట. ఎంతకీ ఆమె ఒప్పుకోకపోయే సరికి ముగ్గురు వ్యక్తులు ఆమె మీద తీవ్రంగా దాడి చేశారట.

ఇక్కడ విశేషం ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీకి చెందిన వ్యక్తులే ఆమెను హత్య చేశారని తెలుస్తుంది. అంతేకాదు ఈ కేసులో ఓ పోలీస్ ఆఫీసర్ హస్తం కూడా ఉందని అంటున్నారు. సుంబుల్ ఖాన్ పై ఇదవరకు కూడా ఇలా రెండు మూడు సార్లు దాడులు జరిగాయట. అప్పుడు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదట.

నటులపై ఈ రకంగా దాడి చేసి హత్య చేయడం నిరసిస్తూ మిగతా వారు సుంబుల్ ఖాన్ తరపున ప్రశ్నిస్తూ ధర్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ న్యూస్ గా నిలిచింది. కేవలం ఈవెంట్ కు అటెండ్ అవని కారణంగా హత్య చేయడం మాత్రం దారుణమని అందరు అంటున్నారు.

Leave a comment