సెక్స్ షూట్లో ఇబ్బంది పెట్టిన నిర్మాత.. తరువాత ఎం జరిగింది..?

92

సెక్స్ సీన్ షూటింగ్ చేస్తున్న సమయంలో నిర్మాత ఇబ్బంది పెట్టాడని, అయినా ఆయన చాలా మంచోడు అంటోంది ఓ అమ్మడు. షూటింగ్ సమయంలో ఎంతో ఇబ్బందికి గురి చేసినా కూడా ఆయన మంచోడు అని అంటుందంటే నిర్మాత మీద అభిమానమైనా ఉండాలి లేదా ఆయన వ్యవహారం తెలిసిన వాడైనా అయి ఉండాలి. ఏదేమైనా ఇది వివాదం కాకుండా దర్శకురాలు కూడా ఎంతో విజ్ఞత ప్రదర్శించిందని అంటుంది ఆ సెక్స్ సుందరి. ఇంతకి ఎవరా సుందరి, ఎవరా నిర్మాత.

2017లో లిప్స్లాక్ అండర్ మై బుర్ఖా అనే బాలీవుడ్ సినిమా రూపొందింది. ఈ చిత్రానికి దర్శకత్వం అలంకృత శ్రీవాస్తవ. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో బాలీవుడ్ నటి ఆహాన కుమ్రా నటించింది. ఈ చిత్రంలో ఆమే బోల్డ్‌గా పవర్‌ఫుల్‌గా నటించింది. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న లొకేషన్‌కు నిర్మాత వచ్చారు. అప్పుడు దర్శకురాలు సెక్స్ సన్నివేశాలను నటిస్తున్నారని బాలీవుడ్ నటి ఆహానా కుమ్రా ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది.

శృంగార భరితమైన సన్నివేశాలను దర్శకురాలు చిత్రిస్తున్నది. నేనేన్నడు అలాంటి సన్నివేశాల్లో పాల్గొనలేదు. అయినా షూటింగ్లో దర్శకురాలు చెప్పినట్లుగా నటిస్తున్నాను. అదే సమయంలో నిర్మాత ప్రకాశ్ ఝా అక్కడికి వచ్చి దర్శకురాలికి కొన్ని సన్నివేశాలను సూచించాడు. దర్శకురాలు నాకు నిర్మాత చెప్పిన విషయం చెప్పడంతో తాను వెంటనే నిర్మాతను అక్కడి వెళ్ళిపోమని దర్శకురాలికి సూచించాను, దీంతో వెంటనే ఆయన అక్కడి నుంచి వెళ్ళి పోయాడని ఆమే వివరించారు. ఇంతకు ఆయన దర్శకుడు కావడంతో నటీనటుల అభిప్రాయాలను గౌరవించగలడు. అందుకే ఆయన అక్కడి వెళ్ళిపోయాడని, ఆయన చాలా మంచివాడని ఆమే కితాబిచ్చింది. ఆయన గొప్పతనానికి నిదర్శనమని ఆమే ఆయన ప్రవర్తనను కొనియాడింది.

Leave a comment