ఎయిడ్స్ వ్యాధితో మృతి చెందిన హీరోయిన్…

heroien-died

గత కొన్ని రోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో శ్రీ రెడ్డి మహిళల పై ఇండస్ట్రీ లో జరుగుతున్న అన్యాయాల మీద చేస్తున్న పోరాటం ఎ స్థాయికి చేరిందో తెలిసిందే. చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ వివాదం ఎప్పటి నుండో ఉన్న విషయం అందరికి తెలిసిందే. కానీ కొన్ని రోజులుగా ఈ వివాదం తార స్థాయికి చేరింది. ఈ నేపధ్యంలో 80వ దశాబ్ధంలో పలు తమిళ సినిమాల్లో నటించిన నటి నిషా నూర్ ఉదంతం మరో సారి తెర పైకి వచ్చింది. తమిళ సినిమాలు “టిక్ టిక్ టిక్‌”తో పాటు ‘కళ్యాణ అగదిగళ్’ సినిమాల్లో ఆమె నటించింది.
ఒక ప్రముఖ ప్రొడ్యూసర్ తనకి అవకాశాలు ఇస్తానని చెప్పి మోసం చేసాడని అప్పట్లో తాను పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

ఈ ఉదంతం తరువాత నిషా నూర్ అవకాశాలు లేక చాల రోజులు ఇబ్బంది పడ్డారు. దీంతో ఆమె అనేక ఆర్ధిక సమస్యలు ఎదుర్కోవలసి వచ్చింది. ఆ తరువాత తీవ్ర నిరాశతో చేసేది ఏమి లేక వేశ్య వృత్తిలోకి అడుగు పెట్టాల్సిన పరిస్థితి ఎర్పడింది. చాల రోజులు ఆ వృత్తి లోనే ఉన్న ఆమె చివరికి భయంకరమైన ఎయిడ్స్ వ్యాధి సోకి 2007 మరణించిందని సమాచారం.

Leave a comment