హైటెక్ వ్యభిచారం చేస్తూ అడ్డంగా బుక్యయిన హీరోయిన్..

26

హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిపోదామని ఆశపడి ఇండస్ట్రీకి వచ్చే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుండటం మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నో ఆశలతో వారు ఈ రంగుల లోకాన్ని ఏలేద్దాం అని అనుకుంటూ వస్తున్నారు. కొంతమంది ఇవేమీ సాధ్యం కావడం చూడకుండానే వెనుదిరుగుతున్నారు. అష్టకష్టాలు పడి కొంత మంది హీరోయిన్ ఛాన్స్‌లు దక్కించుకుంటే వారికి అదృష్టం కలిసి రాకపోవడంతో వారు వేరు మార్గాలను చూసుకుంటున్నారు. అయితే కొంత మంది మాత్రం హీరోయిన్ అయ్యేందుకు ఎలాంటి యవ్వారం చేయడానికైనా రెడీ అంటున్నారు.

తాజాగా ఇలాంటి కోవలోకే చెందిన ఒక హీరోయిన్ పాడు పని చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముంబయి నుండి తెలుగులో టాప్ హీరోయిన్‌గా సెటిల్ అవుదామని ఆశపడ్డ ఒక సెకెండ్ గ్రేడ్ హీరోయిన్‌ను వ్యభిచార రొంపిలోకి దించారు కొంతమంది నిర్వాహకులు. సికింద్రాబాద్‌లోని చిలకలగూడకు చెందిన జనార్ధన రావు అనే నిర్వాహకుడు ముంబైలో తనకు పరిచయం ఉన్న సెకెండ్ గ్రేడ్ హీరోయిన్లను తెలుగులో స్టార్ హీరోయిన్లుగా మారుస్తానని చెప్పి ఇక్కడికి తీసుకువచ్చి వారితో గతకొంత కాలంగా వ్యభిచారం చేయిస్తున్నాడు. ఈ క్రమంలో బంజారా హిల్స్‌లోని ఒక స్టార్ హోటల్‌లో ఈ అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలుసుకున్న పోలీసులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఇలా రంగుల ప్రపంచంలో రాజ్యం ఏలుదాం అనుకుని వ్యభిచార ఊబిలో చిక్కుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటంతో తెలుగు అమ్మాయిలు హీరోయిన్ అవుదామనే ఆలోచన కూడా రానివ్వడం లేదు. కొంత మంది వెధవలు చేరి తమ ఇండస్ట్రీని భ్రష్టు పట్టిస్తుండటంతో ఇండస్ట్రీలోని ప్రముఖులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మరి ఇలాంటి వారికి ఎప్పుడు చెక్ పడుతుందా అని చూస్తున్నారు జనాలు.

Leave a comment