Gossipsహీరో గోపిచంద్ కి షూటింగ్ లో ప్రమాదం. పరిస్థితి విషమం ..?

హీరో గోపిచంద్ కి షూటింగ్ లో ప్రమాదం. పరిస్థితి విషమం ..?

టాలీవుడ్ లో ప్రముఖ విప్లవ దర్శకుడు టి.కృష్ణ తనయుడు గోపిచంద్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా పెద్దగా హిట్ కాకపోవడంతో విలన్ గా నటించడానికి సిద్దపడ్డారు. ఈ నేపథ్యంలో జయం, నిజం, వర్షం లాంటి సినిమాలో విలన్ గా నటించినప్పటికీ హీరో రేంజ్ పేరు సంపాదించాడు. ఆ తర్వాత యాక్షన్ తరహా సినిమాల్లో నటించిన గోపిచంద్ ఆ మద్య లౌక్యం సినిమాతో మంచి ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఈ సినిమా తర్వాత గోపించంద్ నటించిన సినిమాలు దాదాపు అన్ని ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. ప్రస్తుతం తిరు దర్శకత్వం లో అనిల్ సుంకర్ నిర్మిస్తొన్న ఓ సినిమాలో గోపిచంద్ నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జైపూర్ లో జరుగుతుంది.

తాజాగా ఈ షూటింగ్ లో గోపిచంద్ బైక్ చేజింగ్ చిత్రీకరణ చెస్తున్న సమయంలో స్కిడ్ అవ్వటంతో స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. వెంటనే అతన్ని దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా గోపిచంద్ ని పరీక్షించిన డాక్టర్లు ప్రాణానికి ప్రమాదం ఏమీ లేదని చెప్పడంతో ఊపిచి పీల్చుకున్నారు చిత్ర యూనిట్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news